ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తుంది రీనా అనే మహిళ. గత 8 సంవత్సరాలుగా ఈ ఇంట్లోనే పని చేస్తోంది. ఏళ్ల తరబడి ఇక్కడే పనిచేస్తున్న రీనాను ఆ కుటుంబం ఎంతగానో నమ్మింది. ఇదిలా ఉండగా, ఆ కుటుంబ సభ్యులు కొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను గమనించిన కుటుంబ సభ్యులు పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. ఇందుకోసం ఇంట్లోని పలుచోట్ల సీసీ కెమెరాలు అమర్చారు.
యూపీలోని ఘజియాబాద్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. పనిమనిషి పనిచేసే ఇంట్లో కుటుంబమంతా క్రమంగా అనారోగ్యం పాలవుతోంది. దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు యజమాని ఇంట్లో పలుచోట్ల కెమెరాలు అమర్చాడు. ఈ కెమెరా ద్వారానే అతని ఇంట్లో పనిమనిషి రీనా చేసిన జుగుప్సాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతి రోజూ ఆ ఇంట్లో చేసే చపాతీ పిండిలో మూత్రం కలుపుతూ కెమెరాకు చిక్కింది. వెంటనే పోలీసులకు కంప్లైట్ చేయటంతో పనిమనిషిని అరెస్టు చేశారు. విచారణలో ఆమె అలా చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది.
యూపీలోని ఘజియాబాద్‌లోని థానా క్రాసింగ్ రిపబ్లిక్ ఏరియాలోని సొసైటీలో జరిగింది ఈ షాకింగ్ ఘటన. ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తుంది రీనా అనే మహిళ. గత 8 సంవత్సరాలుగా ఈ ఇంట్లోనే పని చేస్తోంది. ఏళ్ల తరబడి ఇక్కడే పనిచేస్తున్న రీనాను ఆ కుటుంబం ఎంతగానో నమ్మింది. ఇదిలా ఉండగా, ఆ కుటుంబ సభ్యులు కొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను గమనించిన కుటుంబ సభ్యులు పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. ఇందుకోసం ఇంట్లోని పలుచోట్ల సీసీ కెమెరాలు అమర్చారు. సీసీటీవీ చూసి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వారు భయపడిన దానికంటే దారుణంగా ప్రవర్తించింది రీనా. వారికి వండిపెడుతున్న చపాతీ పిండిలో రీనా మూత్రం కలుపుతూ కెమెరాలో కనిపించింది. అది చూసిన కుటుంబం ఒక్కసారిగా కుదేలయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఆహారంలో మూత్రం కలిపిన రీనాను పోలీసులు అదుపులోకి అరెస్టు చేశారు. విచారణలో, రీనా తను చేసిన పనికి కారణాన్ని చెప్పింది. మొదట రీనా తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసినప్పటికీ ఆ తర్వాత సీసీటీవీ వీడియోను చూపించగా, నేరం ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. బాస్ తిట్టడం వల్లే ఇదంతా చేశానని రీనా చెప్పింది. ఆమెను తన ఓనర్ ఎప్పుడూ తిడుతూ ఉండేవాడని, చిన్న విషయాలకే రాద్దాంతం చేసేవాడని చెప్పింది. అందుకే ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలా చేశానని చెప్పింది.Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





