బీటెక్ చదువుతున్న 19 ఏళ్ల ప్రభుకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మకం. తనకు శక్తులు ఉన్నాయంటూ ఎన్నోసార్లు తన తోటి విద్యార్థులకు చెబుతుండేవాడు. సోమవారం నాడు కాలేజీ హాస్టల్ 4వ అంతస్తు వరండాలో ఇద్దరు విద్యార్థులు నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా, అటుగా వచ్చిన ప్రభు.. వారు చూస్తుండగానే హఠాత్తుగా పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేశాడు.
తనకు అతీతశక్తులు ఉన్నాయని చెప్పుకుంటూ ఓ కాలేజీ విద్యార్థి.. హాస్టల్‌లోని నాలుగో అంతస్తు నుంచి అమాంతంగా కిందకు దూకేశాడు..ఈ ఘటనలో బీటెక్ చదువుతున్న ఆ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది హుటాహుటినా అతన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో 19ఏళ్ల ఆ విద్యార్థికి కాళ్లు, తుంటి, ముఖంపై గాయాలైనట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ షాకింగ్ తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది.
తమిళనాడు కోయంబత్తూరులోని కర్పగం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న 19 ఏళ్ల ప్రభుకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మకం. తనకు శక్తులు ఉన్నాయంటూ ఎన్నోసార్లు తన తోటి విద్యార్థులకు చెబుతుండేవాడు. సోమవారం నాడు కాలేజీ హాస్టల్ 4వ అంతస్తు వరండాలో ఇద్దరు విద్యార్థులు నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా, అటుగా వచ్చిన ప్రభు.. వారు చూస్తుండగానే హఠాత్తుగా పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేశాడు. దీంతో అతని కాళ్లు, చేతులు విరిగాయి. తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, హాస్టల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోయంబత్తూరు సమీపంలోని మైలేరిపాళయంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్‌లో బీటెక్ చదువుతున్నాడు బాధిత విద్యార్థి ప్రభు. కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నాడు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025