ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుందామని స్థానికంగా ఉన్న ఓ వైన్ షాపులో మద్యం బాటిల్లు కొని ఇంటికి తెచ్చాడో వ్యక్తి. ఆనక పార్టీ స్టార్ట్ చేద్దామని ఓ బీరు బాటిల్ మూత తీయబోయాడు. అంతే బాటిల్ లోపల కనిపించిన సీన్ చూసి పరేషాన్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
వికారాబాద్, అక్టోబర్ 25: పార్టీ చేసుకుందామని స్థానిక దుకాణంలో పెద్ద ఎత్తున బీర్లు కొనుగోలు చేశాడో వ్యక్తి. ఆనక వాటిని తీసుకొచ్చి.. ఓపెన్ చేయబోగా బీరు సీసాలో కనిపించిన దృశ్యం చూసి గుడ్లు తేలేశాడు. బీరు సీసాలో ఓ సరీసృపం తేలుతూ కనిపించింది. దీంతో పరాషానైన సదరు వ్యక్తి బాటిల్‌ను ఓపెన్ చేయకుండానే నేరుగా షాప్‌కు తీసుకెళ్లాడు. ఇదేంటని ప్రశ్నించగా.. తమకేం తెలియదని దబాయించడంతో చిర్రెత్తిపోయిన సదరు వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కేరెల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, అనంతయ్య ఇద్దరూ స్నేహితులు. వీరు పార్టీ చేసుకోవడానికని రూ.4వేల విలువైన మద్యం సీసాలను స్థానికంగా ఉన్న ఓ వైన్ షాపు నుంచి కొనుగోలు చేశారు. బీర్లతో పాటు వివిధ బ్రాండ్లకు చెందిన మందును ఇంటికి తీసుకెళ్లారు. తీరా పార్టీ చేసుకుందామని బీరు బాటిల్ ఓపెన్ చేయబోతే అందులో ఏదో తేలుతూ కనిపించింది. ఇదేంటా అని క్షుణ్నంగా పరిశీలించి చూడగా.. మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ కనిపించింది. బడ్‌వైజర్ బ్రాండ్‌కు చెందిన బీరు బాటిలో లోపన చనిపోయిన బల్లి తేలుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాకైన స్నేహితులు ఇద్దరూ బాలిల్ ఓపెన్ చేయకుండానే.. దానిని కొనుగోలు చేసిన షాపుకు తీసుకెళ్లారు
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





