అది చూట్టానికి ఐస్ క్రీమ్ లానే ఉంటుంది. తింటే కూడా ఐస్ క్రీమ్ టేస్టే ఉంటుంది. రేట్ కూడా కాస్త తక్కువే. అలాగని తిన్నారో.. ఇక హాస్పిటల్‌లో పడాల్సిందే. కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కంత్రీగాళ్లు. మండుతున్న ఎండలను క్యాష్ చేసుకుని జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా మరో కల్తీ బాగోతం బట్టబయలైంది.
వరంగల్ లో బేకరీ, ఐస్‌క్రీమ్ తయారీ వ్యాపారులు బరితెగిస్తున్నారు.. ఆహార భద్రత ప్రమాణాలు గాలికి వదిలేస్తున్న వ్యాపారులు కల్తీ ఆహార పదార్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్‌ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చారు. వరుస దాడుల్లో రోజుకో చోట కల్తీ బేకరి ప్రొడక్ట్స్, ఐస్ క్రీం తయారీ ప్రొడక్ట్స్ పట్టుబడటం కలవరపెడుతోంది.
వరంగల్‌లో గత నెలరోజులుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ ఆహార పదార్థాలు తయారీ విక్రయాలపై ఫోకస్ పెంచారు. కల్తీగాళ్ళ కేసులు పెడుతున్నా =కల్తీ ఆహార పదార్థాల తయారీదారుల్లో మార్పు రాలేదు. తాజాగా వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్ యార్డు సమీపంలో బేకరీ, ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గడువు ముగిసిన కెమికల్స్, కల్తీ బేకరీ ఉత్పత్తులతోపాటు, అపరిశుభ్రంగా ఐస్‌క్రీమ్స్ తయారీ చేస్తున్నట్టు గుర్తించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బేకరీ ఫుడ్ ఐటమ్స్ తయారీ చేస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. 30 రకాల ఐస్‌క్రీమ్ ప్రొడక్ట్స్, బేకరి ప్రొడక్ట్స్ సీజ్ చేశారు.
వీడియో చూడండి
ఇప్పటికే పోలీసులు ఐస్‌క్రీం పార్లర్లపై మరింత ఫోకస్ పెట్టారు. నగరంలో ఇంకా ఎన్ని పార్లర్లు ఉన్నాయి.. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ అమ్మకాలు జరిగాయన్న వాటి వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సో డియర్ సిటిజన్స్ బీ అలెర్ట్
Also read
- మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..
- Crime news: భర్తని చంపి.. డోర్ డెలివరీ చేసిన భార్య, బంధువులు
- Gandikota Inter Girl: ‘అన్నా ప్లీజ్ నన్ను వదిలేయ్’.. గండికోట యువతి హత్య కేసులో విస్తుపోయే విషయాలు!
- love couple : ఇప్పటికిప్పుడే.. నన్ను పెళ్లి చేసుకుంటావా? లేక చావామంటావా? ఇదేం సైకో లవ్రా నాయనా?
- Atmakur Forest Scam: ఆత్మకూరు ఫారెస్ట్ కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. కోట్లకు కోట్లే గుటకాయ స్వాహా!