మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ బంకులో హల్ చల్ చేశారు. వాహనాలకు బంకు సిబ్బంది పెట్రోల్ కొడుతుండగా.. తమ వద్ద ఉన్న లైటర్ తీసి వెలిగించారు. అంతే ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో బంకు సిబ్బందితో సహా అక్కడే ఉన్న పలువురు భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
నాచారం, అక్టోబర్ 27: మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ఆకతాయిలు పెట్రోల్ బంకులో హల్‌చల్ చేశారు. వాహనదారులు తమ వాహనాలకు పెట్రోల్ కొట్టించుకుంటూ ఉండగా తన వద్ద ఉన్న లైటర్‌ను వెలిగించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన పెట్రోల్ బంక్ నిర్వహకులు మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. లేదంటే ఊహకందని విధ్వంసం చోటు చేసుకునేంది. ఈ షాకింగ్ ఘటన నాచారంలో శనివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటీజే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌లోని నాచారం పీఎస్ పరిధిలో పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. మల్లాపూర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ద్విచక్ర వాహనానికి పెట్రోల్ పోస్తుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ఆకతాయిలు పెట్రోల్ బంకు వద్దకు వచ్చారు. వీరిద్దరూ డేరింగ్‌కు సంబంధించి బెట్ట కాశారు. అరుణ్ వద్ద లైటర్ ఉండటంతో చిరన్‌ని వెలిగిస్తావా అని అడిగాడు. నీకు దమ్ముంటే వెలిగించు చూద్దాం.. అని రెచ్చగొట్టాడు. దీంతో రెచ్చిపోయిన చిరన్ లైటర్‌ను వెలిగించాడు. దీంతో పక్కనే పెట్రోల్ నింపుతున్న వాహనంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బంకు సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగిన సమయంలో అక్కడ ఓ మహిళ, మరో చిన్నారితో సహా పలువురు వ్యక్తులు ఉన్నారు. దీనిపై సమాచారం అందుకున్న నాచారం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ SK మైబెల్లీ సియాసట్ కామ్ నిందితులు చిరన్, అరుణ్ ఇద్దరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిద్దరూ బీహార్‌కు చెందిన వారుగా తెలిపారు. గంజాయి మత్తులో ఉన్న యువకులు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది
ఇందుకు సంబంధించిన దృశ్యాలు పెట్రోల్ బంకులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మంటలు అంటుకోవడంతో భయంతో అందరూ దూరంగా పరుగులు తీయడం వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Also read
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం
- డబ్బులిస్తాం.. అంటూ ఇంటికి పిలిచిన దంపతులు.. చివరకు ఏం జరిగిందంటే..