April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య



హైదరాబాద్: నగరంలోని నారాయణ కాలేజీలో ఇంటర్  విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనూష కాలేజీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వివరాల ప్రకారం.. బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో అనూష ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆదివారమే అనూషను పేరెంట్స్ హాస్టల్లో దింపి వెళ్లారు. ఆమెను డ్రాప్ చేసిన కాసేపటికే గదిలో ఉరివేసుకుని అనూష ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం అనూష పేరెంట్స్కి ఫోన్ చేసి.. విద్యార్థి పేరెంట్స్కు స్పృహ తప్పి కిందపడిపోయినట్టు సమాచారం ఇచ్చారు. దీంతో, సిటీ దాటకముందే.. పేరెంట్స్ కాలేజీకి బయలుదేరారు. వారు.. కాలేజీకి వెళ్ళే సరికి అనూష ఉరి వేసుకొని చనిపోయిందని యాజమాన్యం తెలిపింది యాజమాన్యం. పేరెంట్స్ కాలేజీకి రాకముందే అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించింది నారాయణ కాలేజీ యాజమాన్యం. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

ఇక, తాజాగా బాచుపల్లి నారాయణ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనూష బంధువులు నారాయణ కాలేజీలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. అనూష సూసైడ్ చేసుకున్న విషయాన్ని తమకు ముందే ఎందుకు చెప్పలేదని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇదే సమయంలో తాము అనూష డెడ్బాడీని చూడకముందే ఎందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారని అడిగారు. ఈ క్రమంలో కాలేజీ ఎదుట వారు ఆందోళనకు దిగారు. దీంతో, పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పంపించే ప్రయత్నం చేయగా.. వాగ్వాదం చోటుచేసుకుంది.

Also read

Related posts

Share via