November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

Telangana: ఈతవనంలో చిమ్మచీకటిలో పదిహేను గంటలు నరకయాతన.. చివరకీ..!



చిమ్మ  చీకట్లలో సాయం అందక, చూసేవారు లేక నిస్సయాకస్థితిలో రాత్రంతా 15 గంటలపాటు ‌నరకయాతన‌ అనుభవించాడు.


అతని వృత్తి కల్లు గీత.. నిత్యం కల్లు తీస్తే గానీ పూట గడవదు. రోజులాగే కల్లు గీసేందుకు ఈతచెట్టు ఎక్కాడు. అయితే కొద్దిపాటి వర్షానికి పట్టుతప్పి క్రిందపడిపోయాడు ఓ‌ గీత కార్మికుడు. చిమ్మ చీకట్లలో సాయం అందక, చూసేవారు లేక నిస్సయాకస్థితిలో రాత్రంతా 15 గంటలపాటు ‌నరకయాతన‌ అనుభవించాడు. దట్టమైనా చెట్లపొదలు ఉండడం, ఎవ్వరూ చూడకపోవడంతో రాత్రంతా వనంలోనే ఉండిపోయాడు.


పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఎగోలపు‌ నర్సయ్య గౌడ్ కల్లు గీత వృత్తి చేసుకుంటూ జీవనం‌ కొనసాగిస్తున్నాడు. రోజువారిలాగే సోమవారం(అక్టోబర్ 21) రోజున‌ కల్లు గీసేందుకి ఈత వనం లోకి వెళ్లాడు. కల్లు గీసేందుకు ప్రయత్నించగా ఈతచెట్టు నుండి జారి క్రింద పడ్డాడు. దీంతో అతని వెన్నెముకతో‌ పాటుగా అవయవాలకు తీవ్రగాయాలు అయ్యాయి. చుట్టూ‌ దట్టమైనా పొదలు‌‌ ఉండడంతో నర్సయ్య గౌడ్‌ని‌‌ ఎవ్వరూ చూడకపోయారు. రాత్రి‌ సమయంలో‌ దాదాపుగా పదిహేను‌‌గంటలు లేవలేని‌ స్థితిలో నిస్సహాకంగా‌ ఉండిపోయాడు.

భారీ వర్షం కురవడంతో తడుస్తూ అర్తనాదాలు చేసిన రాత్రిపూట ఎవ్వరూ పట్టించుకోలేదు. ఉదయం ‌ఎనిమిది‌ గంటల‌ సమయంలో‌ అటువైపుగా వెళ్తున్న వారు‌ గమనించి నర్సయ్య గౌడ్ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. దీంతో గీత కార్మికుడిని వరంగల్ ‌ఎంజీఎం అసుపత్రికి తరలించారు. వెన్నెముక, పట్టెముకలకు బలమైన గాయాలు‌ కావడంతో‌ కొనఉపిరితోపోరాడుతున్నాడు నర్సయ్య గౌడ్. కాగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు

Also read

Related posts

Share via