గ్రనేడ్‌తో పాటు ఓహెచ్చరిక నోట్ కూడా లభ్యమైనట్లుగా అధికారులు తెలిపారు. గ్రనేడ్ సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా దళాలు గవర్నర్ నివాసానికి మరింత గట్టి పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం రాజ్‌భవన్‌కు సమీపంలో ఉన్న
మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లోని ఓ కళాశాల గేట్ వద్ద గ్రనేడ్ కలకలం రేపింది. గవర్నర్ అధికార నివాసానికి కేవలం 200 మీటర్ల దూరంలో గ్రనేడ్ లభ్యమవ్వడంతో సంచలనం సృష్టిస్తోంది. గ్రనేడ్‌తో పాటు శ్రామికవర్గ విద్యార్థుల హక్కులను గౌరవించాలంటూ ఓ నోట్ కూడా లభ్యమైనట్లుగా అధికారులు తెలిపారు. గ్రనేడ్ సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా దళాలు గవర్నర్ నివాసానికి మరింత గట్టి పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం రాజ్‌భవన్‌కు సమీపంలో ఉన్న జీపీ మహిళా కళాశాల గేట్ల ముందు హ్యాండ్ గ్రెనేడ్ కనిపించిందని పోలీసు అధికారులు తెలిపారు.
మణిపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంఫాల్‌లోని సెంట్రల్ జైలు రోడ్‌లోని జిపి మహిళా కళాశాల గేట్ సమీపంలో ఉదయం 6 గంటల సమయంలో పాదాచారులు గ్రెనేడ్‌ను గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఇంఫాల్ పోలీస్ స్టేషన్ నుండి ఒక బృందం మణిపూర్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS)తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుంది. BDS బృందం ఉదయం 6:40 గంటలకు విజయవంతంగా బాంబును నిర్వీర్యం చేసింది.
ఉదయం 7:20 గంటలకు లాంఫెల్ గేమ్ విలేజ్ ప్రాంతంలో దాన్ని పడవేసినట్టుగా వెల్లడించారు. బాంబు ప్లేస్‌మెంట్ వెనుక ప్రమేయం ఉన్నవారి ఆచూకీ తెలియాల్సి ఉంది. తదుపరి విచారణ కోసం ఇంఫాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది .
Also Read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





