నెల్లూరు జిల్లా రాపూర్ లో ఘోరం జరిగింది. యువ దంపతుల కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. దీపావళి పండగ కోసం రెండు రోజుల క్రితం అత్తగారింటికి బయలు దేరిన భార్యాభర్తలు కిడ్నాప్ కు గురయ్యారు. వెంకటగిరి మండలం సిసి కండ్రిగకు చెందిన దంపతులు వెల్లూరు రాజా పెంచిలమ్మ. వీరి వివాహం జరిగి ఆరు నెలలు అవుతోంది. ఈ క్రమంలో దీపావళి పండగ సందర్భంగా పెంచిలమ్మ భర్తతో కలిసి తల్లిగారింటికి బయలుదేరారు. ఈ ఇద్దరు కూడా అమాయకులు. వెంకటగిరిలో బస్టాండ్ లో వీరు మిస్ అయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు రాజా పెంచిలమ్మను అపహరించినట్లు తెలుస్తోంది. యువదంపతులను కిడ్నాప్ చేసిన తర్వాత రాపూర్ అడవిలోకి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
దంపతుల కిడ్నాప్ పై వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటగిరిలో సాయంత్రం 4 గంటల సమయంలో బస్ ఎక్కించామని ఆ తర్వాత ఇద్దరి ఫోన్లు స్విఛ్చాఫ్ వచ్చాయని ఆవేధన వ్యక్తం చేశారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వారిని ఎలాగైనా వెతికి పెట్టాలని పోలీసులను కోరారు. కాగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు రాజా పెంచిలమ్మను వెతికేందుకు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులు యువదంపతులను రావూరు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్లు గుర్తించారు. అంతకు ముందు ముఖానికి కర్చీఫ్ కట్టుకున్న వ్యక్తి ఈ ఇద్దరు భార్యాభర్తలను వెంబడించినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
దీని ఆధారంగా వెంటనే అడవి ప్రాంతంలో గాలింపు చేపట్టగా భర్త రాజాను పోలీసులు గుర్తించారు. అయితే పెంచిలమ్మ ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. పెంచిలమ్మ కోసం పోలీసుల గాలింపు ముమ్మరం చేశారు. పెంచిలమ్మ ఏమై ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. యువదంపతుల కిడ్నాప్ వెనక కారణం ఏంటని పోలీసులు విచారణ చేపట్టారు. వారి వద్ద డబ్బు కొట్టేయడం కోసమే కిడ్నాప్ చేశారా? లేదా పెంచిలమ్మపై ఏమైనా అఘాయిత్యానికి పాల్పడేందుకు ఈ ఘోరానికి పాల్పడ్డి ఉంటారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పెంచిలమ్మకు ఏమైనా హామి తలపెట్టి ఉంటారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెంచిలమ్మ ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పండగ వేళ కిడ్నాప్ కు గురవడంతో పెంచిలమ్మ రాజా కుటుంబాల్లో ఆందోళన నెలకొన్నది. సంతోషంగా గడపాల్సి ఉండగా భార్యాభర్తల కిడ్నాప్ తో వారంతా చింతిస్తున్నారు. ఇటీవల డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. డబ్బు పేరుతో మోసం చేశాడని అతడి పిల్లలను పట్టపగలే కిడ్నాప్ చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
Also read
- Watch Video: ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. సైరన్ మోగడంతో పరార్! ఎక్కడంటే..
- ఆరుగురు మహిళలు.. ధూమ్ సినిమా రేంజ్లో ప్లాన్.. చివరకు జరిగిందిదే..
- ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ తండ్రి ఆశయం కోసం..
- అర్ధరాత్రి అమ్మాయిల ఆశ్రమ పాఠశాలలో దూరిన ఆగంతకుడు.. ఇంతలోనే..!
- చిన్న కాటే ప్రాణాలు తీసింది.. రూ.70 లక్షలు ఖర్చుపెట్టినా..





