April 11, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP News: భారీ శబ్ధానికా.. దూకుడు నృత్యానికా.. డీజే ముందు డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి

మితిమీరిన జోష్ కొంప ముంచుతుంది. కరోనా తర్వాత ఏమవుతుందో ఏమో తెలియడం లేదు కానీ.. కాస్త బర్డెన్ పడినా చాలు.. చిట్టి గండెలు ఆగిపోతున్నాయి. అమలాపురంలో ఓ వ్యక్తి అలానే కన్నుమూశాడు.


డీజే.. ఉంటే చాలు పూనకాలు లోడింగ్ అవడాని‌కి..!  కానీ ఈ జోష్‌లో DJ హోరు హద్దులు దాటితే ఏకంగా ప్రాణాలే పోతాయ్..! తాజాగా కోనసీమలో ఇదే జరిగింది. మితిమీరిన DJ సౌండ్స్‌, దానికి తగినట్లుగా స్పీడ్ స్టెప్స్.. కట్ చేస్తే.. ఓ గుండె ఆగిపోయింది. అమలాపురం సమీపంలోని కొంకాపల్లి దసరా వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ 21 ఏళ్ల యువకుడు కుప్పకూలిపోయాడు.  అప్పటివరకూ సరదాగానే గడిపిన యువకుడు.. ఒక్కసారిగా స్ఫృహతప్పిపోయేసరికి చుట్టుపక్కలవాళ్లు కంగారుపడ్డారు. వెంటనే అతనికి CPR చేశారు.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  ఐతే.. అతను చనిపోయినట్టు డాక్టర్లు చెప్పడంతో విషాదం అలముకుంది.. మృతుడు బండారులంకకు చెందిన 21 ఏళ్ల వినయ్‌గా గుర్తించారు.


కోనసీమ ప్రాంతంలో దసరాకి చెడితాలింఖానా విన్యాసాలతో దసరా వేడుకలు జరుగుతాయి.. ఈ ఉత్సవాల్లో DJకి స్టెప్పులేస్తూ వినయ్‌ కుప్పకూలిపోవడంతో అంతా షాక్‌కి గురయ్యారు. హైదరాబాద్ నుంచి దసరా సెలవులకు సొంత ఊరు వచ్చాడు వినయ్. రెండు రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. ఐతే.. శనివారం రాత్రి డీజే దగ్గర డాన్సులు చేస్తూ కుప్పకూలిపోయాడు. అతిగా DJ సౌండ్‌‌ పెట్టడం వల్ల ఆ ప్రభావం గుండెపై పడి ఇలా జరిగిందని స్థానికులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

Also read

Related posts

Share via