SGSTV NEWS
Andhra PradeshCrime

మహిళ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఎంతకీ దారి తీసిందో తెలుసా?

కాకినాడ జిల్లా కాజులూరు మండలం శాలపాకలో ఘర్షణ ముగ్గురు ప్రాణాలు తీసింది. పాత కక్షలు నేపథ్యంలో కత్తులతో దాడి చేసుకున్న ఇరువు వర్గాల్లో ముగ్గురు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దీపావళి నేపథ్యంలో మద్యం సేవించి ఇరువర్గాలు ఘర్షణ పడినట్లు తెలుస్తుంది. దాడిలో మృతి చెందిన వారు బత్తుల రమేష్, బత్తుల రాజు, బత్తుల చిన్ని ఉన్నారు.


కాకినాడ జిల్లా గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధి, శలపాక గ్రామంలో ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మృతిచెందారు.  గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని శలపాక గ్రామం గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.  ఈ విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడ సర్కిల్ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఆయన ఏర్పాట్లు చేశారు. కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ రఘవీర్ విష్ణు, కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, కాకినాడ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది సంఘటన స్థలం వద్దకు చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this