November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: వీళ్లేం మనుషులు రా స్వామీ.. దీన్ని కూడా వదలరా.. పక్కా నిఘాతో గుట్టరట్టు..!



అలుగు ఇది చాలామందికి తెలియని ఒక అటవీ ప్రాంతానికి చెందిన జీవి. అలుగుకు మనదేశంలోనే కాక విదేశాలలో కూడా మంచి డిమాండ్ ఉంది.


స్మగ్లింగ్‌కు కాదేది అనర్హం అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. అటవీ ప్రాంతంలో దొరికే ప్రతి దానిని స్మగ్లింగ్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ముఖ్యంగా కడప అటవీ ప్రాంతంలో దొరికే అరుదైన ఎర్రచందనం దగ్గర నుంచి మూగజీవాల వరకు అన్నింటిని దోచేసి దాచేసుకుంటున్నారు. తాజాగా మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కడప అటవీ ప్రాంతాలలో అరుదుగా దొరికే అలుగును స్మగ్లింగ్ చేస్తూ కొంత మంది స్మగ్లర్లు పట్టుబడ్డారు.


అలుగు ఇది చాలామందికి తెలియని ఒక అటవీ ప్రాంతానికి చెందిన జీవి. అలుగుకు మనదేశంలోనే కాక విదేశాలలో కూడా మంచి డిమాండ్ ఉంది. కడప జిల్లాలోని కొండ ప్రాంతమైన దట్టమైన అడవిలో అలుగు జీవులు ఉంటాయి. అయితే బద్వేల్ రేంజ్ లోని అటవీ ప్రాంతంలో ఈ అలుగు దొరికింది. ఇది అంతరించిపోతున్న జాబితాలో ఉంది. ఈ ప్రాణిని విక్రయించడం లేదా దానికి హాని కలిగించడం తీవ్రమైన నేరం. అంతేకాకుండా అలుగుకు సంబంధించి మరొక ప్రత్యేకత కూడా ఉంది. దీని చర్మానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్.

అయితే తాజాగా అలుగును అక్రమంగా తరలిస్తుండగా ఐదుగురు స్మగ్లర్లను, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ అంతరించిపోతున్న జాతికి చెందిన అలుగును స్మగ్లింగ్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు ఈ జీవికి విదేశాలలో మంచి రేటు పలుకుతుందని, ఇది చాలా అరుదుగా అటవీ ప్రాంతంలో దొరుకుతుందన్నారు. దీనికోసం చాలా మంది స్మగ్లర్లు అటవీ ప్రాంతంలో వెతికి పట్టుకొని తెలియకుండా విదేశాలకు లేదా లోకల్ గా ఉన్న స్మగ్లర్లకు అందజేస్తారని అటవీ అధికారులు వెల్లడించారు. దాని ద్వారా స్మగ్లింకు పాల్పడుతూ ఉంటారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అలుగు ప్రత్యేకత దాని చర్మం. ఇది చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటుందని, ఎటువంటి పరిస్థితులలోనైనా తట్టుకుని దృఢంగా నిలబడే శక్తి అలుగుకి ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. అందుకే దీని చర్మానికి డిమాండ్ ఎక్కువ అని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు.

Also read



Related posts

Share via