అనంతపురం ఇస్కాన్ టెంపుల్ కి చెందిన ప్రతినిధులు తాడిపత్రిలోని ఓ ప్రైవేటు స్కూల్లో కార్యక్రమానికి వెళ్లి వెస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగనమల మండలం నాయన పల్లి క్రాస్ వద్ద కారు లారీ ఢీకొని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం వైపు నుంచి తాడిపత్రి వెళ్తున్న లారీ.. తాడిపత్రి వైపు నుంచి అనంతపురం వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో స్పాట్‌లోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
అనంతపురం తాడిపత్రి రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా.. వన్ వే లో వెళ్తున్న కారు – లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన ప్రతినిధులు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు వేగంగా వచ్చి లారీని ఢీకొనడంతో.. లారీ కిందకు కారు ఇరుక్కుపోయింది. వెంటనే స్థానికులు కారులో ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అనంతపురం ఇస్కాన్ టెంపుల్ కి చెందిన ప్రతినిధులు తాడిపత్రిలోని ఓ ప్రైవేటు స్కూల్లో శ్రీరామ.. శ్రీకృష్ణ సంకీర్తన, భజన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ కింద ఇరుక్కుపోయిన కారును బయటికి తీసి.. మృతదేహాలను అంబులెన్సులో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Also Read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





