Police : వివాదాస్పద సీఐ అంజూ యాదవ్ ను అరెస్టు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. శ్రీకాళహస్తి సీఐగా ఉన్నప్పుడు మహిళపై దాడి చేసిన ఘటనలో ఈ ఆదేశాలు జారీ చేసింది.
National Commission for Women : శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళను బహిరంగంగా లాగి దాడి చేయడంపై టీడీపీ నేత అనిత ఫిర్యాదుతో స్పందించిన కమిషన్.. వెంటనే అంజూపై FIR నమోదు చేసి అరెస్టు చేయాలని ఏపీ డీజీపీ ని ఆదేశించింది. బాధితురాలు మర్యాదపూర్వకంగా మాట్లాడలేదని, తాను ఆమెను కొట్టలేదని అంజూ ఇప్పటికే వివరణ ఇచ్చారు. అంజూ యాదవ్ వాదనను తిరస్కరించిన మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు
అసలేం జరిగిందంటే ?
2022 సెప్టెంబర్ నెలాఖరులో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ ఉన్న అంజూ యాదవ్ ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించి, రాత్రి సమయంలో ఆమెను కొట్టి బలవంతంగా పోలీసు జీప్ ఎక్కించి స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బాధిత మహిళ ఓ హోటల్ నిర్వహిస్తోంది. మహిళ దగ్గరకు వెళ్లిన సీఐ అంజూ యాదవ్ ఆమె భర్త ఆచూకీ అడిగారు. అయితే మహిళ తెలియదని చెప్పడంతో ఆమెపై సీఐ అంజూ యాదవ్ దాడి చేశారు. నడిరోడ్డుపై మహిళపై అమానుషంగా దాడి చేశారు. ఆమె చీర ఊడిపోతున్న సీఐ స్పందించలేదు. మహిళను బలవంతంగా జీప్ ఎక్కించి రాత్రి సమయంలో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అకారణంగా సీఐ తనపై దాడి చేశారని బాధిత మహిళ ఆరోపించారు. తన కుమారుడు వేడుకున్నా సీఐ పట్టించుకోకుండా దాడి చేశారని .. సీఐ కొంతకాలంగా తమ కుటుంబాన్ని వేధిస్తోందని బాధిత మహిళ ఆరోపించింది.
అప్పట్లోనే జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన వంగలపూడి అనిత
ఈ ఘటనపై అప్పట్లోనే జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత హోంమంత్రి, అప్పట్లో టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత జాతీయ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కమిషన్.. సీఐపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీ ని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. అలాగే ఘటనపై కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేయాలని.. బాధిత మహిళకు వైద్య సౌకర్యాలు కల్పించాలని సూచించింది.
అంజూ వాదన సంతృప్తికరంగా లేకపోవడంతో అరెస్టుకు ఆదేశం
ఈ ఘటనపై అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పోలీసులు చార్జ్ మెమో జారీచేసి ఊరుకున్నారు. అయితే మహిళా కమిషన్ విచారణ కొనసాగించింది. అంజూ యాదవ్ వివరణ సంతృప్తి కరంగా లేకపోవడంతో చర్యలకు ఆదేశించింది. సీఐ అంజూ యాదవ్ పై పలు ఫిర్యాదులు ఉన్నాయి. ధర్నా చేస్తున్న టీడీపీ నేతలపై సీఐ చేయి చేసుకున్న వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి
Also read
- నేటి జాతకములు..13 మార్చి, 2025
- పోసానికి మరో షాక్ – పీటీ వారెంట్‌తో జైలు నుంచి విడుదలకు బ్రేక్
- చిత్తూరు కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్ – దోపిడీకి వ్యాపారి ప్లాన్ –
- పోలీసులకు చుక్కలు చూపించాడు.. తప్పించుకుని ముప్పుతిప్పలు పెట్టిన ఖైదీ!
- Andhra: చోరీ చేసిన సొత్తు ఎక్కడ అంటే.. ఓ చోట గోతాల్లో ఉన్నాయన్నారు.. వెళ్లి చెక్ చేయగా..