తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. నగరాలు, పట్టణాల్లో డ్రగ్స్‌కు సంబంధించి ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో ఒక చోట డ్రగ్స్, గంజాయి ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. అయితే.. సిటీల సంగతి పక్కన బెడితే.. ఇప్పుడు చిన్నపట్టణాల్లోనూ డ్రగ్స్ కల్చర్ వెలుగలోకి వస్తుండడం భయాందోళనకు గురిచేస్తోంది. పోలీసులకు కూడా సవాల్‌గా మారుతోంది. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నంలో డ్రగ్స్ దొరకడం కలకలం రేపింది.
భూపాలపట్నంలో పుట్టినరోజు వేడుకల్లో యువతీ, యువకులు పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అర్థరాత్రి రైడ్ చేశారు. ఫంక్షన్ హాల్‌లో మద్యం బాటిల్స్‌తోపాటు.. బయట ఉన్న కారులో డ్రగ్స్ ప్యాకెట్లు బయటపడ్డాయి. రెండు గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని.. కారును సీజ్ చేశారు. బర్త్ డే ఈవెంట్ ఆర్గనైజర్‌తోపాటు.. ముగ్గురు యువకులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించి.. తాగిన మైకంలో ఉన్నవారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సేవించిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్పెషల్ పార్టీ టీమ్ ఎటాక్ చేయగా.. రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇక.. వీరికి డ్రగ్స్ ఎలా వచ్చాయి?.. వీరే డ్రగ్స్ కొనుగోలు చేసి సేవిస్తున్నారా?.. ఇంకా.. ఎవరికైనా సప్లై చేస్తున్నారా?.. అసలు డ్రగ్స్ రాకెట్ వెనక ఎవరున్నారు?.. అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఇప్పటికే.. ఏపీలో గంజాయి, డ్రగ్స్ వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ వాడకం, సరఫరాను తీవ్రంగా పరిగణిస్తోంది
Also read
- గరుడపురాణం ప్రకారం మరణాన్ని ముందే గుర్తించ వచ్చా.. 6 నెలల ముందు నుంచే ఈ సంకేతాలు కనిపిస్తాయట
- బ్రహ్మంగారి కాలజ్ఞానం 2025లో జరగబోయే ప్రకృతి సృష్టించే విధ్వంసం ఇదే ..!
- నేటి జాతకములు.9 ఏప్రిల్, 2025
- గుడిలో కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే.. సంతోషించండి! ఎందుకో మీకు తెలుసా?
- HYD NEWS: పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!