ఇటీవలే నంద్యాలలో ఆర్ఎంపీ ఎల్లాల కొండయ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా దారుణ హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ ఎల్లాల కొండయ్య దారుణ హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. మృతదేహం జీఎన్ఎస్ఎస్ కెనాల్‌లో బయటపడిన రోజే పోలీసులు కొండయ్య మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.కొండయ్య ఒంటిపై ఉన్న బంగారం కోసమే బెలుం, సింగవరం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఘనపాటి ఆనందరెడ్డి మహేశ్వరమ్మ తన కుమారుడు విశ్వనాథరెడ్డితో కలిసి ఈ హత్య చేసినట్లు కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు మీడియాకు వివరించారు. వారి నుండి బంగారు గొలుసు , రెండు ఉంగరాలతో పాటు దాడికి ఉపయోగించిన ఆయుధాలు, బైకును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.
విశ్వనాథరెడ్డి తీవ్ర అప్పుల్లో కురుకపోయి డబ్బు అవసరం కోసమే కొండయ్య ఒంటిపై ఉన్న బంగారాన్ని కాజేయాలని ప్లాన్ వేశాడు. ప్లాన్ ప్రకారమే హత్య చేశాడని పోలీసులు వివరించారు. విశ్వనాధ్ రెడ్డి ఈనెల 25న మధ్యాహ్నం ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్యకు ఫోన్ చేసి తన తండ్రి ఒంట్లో బాగోలేదని వైద్యం చేయడానికి రావాలని పిలిచాడు. RMP కొండయ్య మందుల బ్యాగుతో వారి వద్దకు వెళ్లాడు. చికిత్స చేస్తున్న సమయంలో వెనుకనుంచి కొండయ్యపై విశ్వనాథ్ రెడ్డి దాడి చేశాడు. సృహ తప్పి పడిపోయిన కొండయ్యను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకున్నాడు. కొండయ్య హత్యకు వృద్ధ దంపతులు విశ్వనాథరెడ్డికి సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు
Also read
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!
- Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..