December 18, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఆంధ్ర ప్రదేశ్ : కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద DRI తనిఖీలు.. ఆ రెండు వాహనాలు చెక్‌ చేసిన అధికారులకు దిమ్మతిరిగిపోయింది..!



రెండు నెలల కిందట మాచవరం, సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలంక పీఎస్‌ల పరిధిలో 15మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 90.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.




ఏపీలో మరోసారి గంజాయి కలకలం సృష్టించింది. బెజవాడలోని కృష్టవరం టోల్‌ప్లాజా వద్ద పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. సోమవారం రోజున DRI అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా 2 వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. అధికారుల కళ్లుగప్పి గుట్టుగా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలను సీజ్‌ చేశారు. రూ1.61 కోట్ల విలువైన 808 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే, విజయవాడలో ఇటీవల గంజాయి పట్టివేత కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు నెలల కిందట మాచవరం, సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలంక పీఎస్‌ల పరిధిలో 15మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 90.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.

Also read

Related posts

Share via