పారిపోతున్న వ్యక్తిని వెంటాడి వేటాడు మరీ పట్టుకుని చావబాదారు. భార్యాభర్తలు కలిసి చెప్పు దెబ్బలు కొట్టారు. కర్నూలు జిల్లాలో పబ్లిక్‌గా అందరూ చూస్తుండగానే జరిగింది.
భర్త పక్కన ఉండగానే పరాయి స్త్రీపై చేయి వేసి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఇంకేముంది సదరు వ్యక్తికి భర్త చేతిలో చెప్పు దెబ్బలు తప్పలేదు. పారిపోతున్న వ్యక్తిని వెంటాడి వేటాడు మరీ పట్టుకుని చావబాదారు. భార్యాభర్తలు కలిసి చెప్పు దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఇది పబ్లిక్‌గా అందరూ చూస్తుండగానే జరిగింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో అరుగు మీద భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. అటుగా వెళుతున్న ఒక వ్యక్తి మద్యం మత్తులో అరుగు మీద కూర్చున్న మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. భర్త పక్కన ఉన్న మహిళపై వెకిలి వేషాలకు తెగించాడు. భర్త అడ్డుకు మందలించడంతో.. ఆ వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు. ఆ వ్యక్తిని వెంటాడి పట్టుకున్న దంపతులు ఇద్దరు కలిసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు
Also Read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





