మచిలీపట్నంలో ఘోరం జరిగింది. భార్యను ఓ భర్త చంపి దాన్ని ఆత్మహత్యగా స్పషించాడు. మచిలీపట్నం వలంద పాలెం, సాంఘిక సంక్షేమ హాస్టల్ సమీపంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న పేరం మల్లేశ్వరరావు భార్య శిరీషను దారుణంగా హత్య చేసి ఉరి వేసుకుని చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
భార్యను కడతేర్చిన భర్త ఆత్మహత్యగా చిత్రీకరణ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కట్టుకధ స్పష్టించాడు. మచిలీపట్నం వలంద పాలెం, సాంఘిక సంక్షేమ హాస్టల్ సమీపంలో ఎలక్త్రిషియన్‌గా పనిచేస్తున్న పేరం మల్లేశ్వరరావు భార్య శిరీషను దారుణంగా హత్య చేసి ఉరి వేసుకుని చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడని తెలుస్తుంది. ఘటనా స్థలిలోని బంధువులను విచారించగా గత కొంతకాలంగా భార్య భర్తల మద్య వివాదం నడుస్తుందని, నాలుగు రోజుల క్రితం వేరే ప్రాంతంలో ఉండే వ్యక్తి ఇక్కడకు వచ్చాడని అతని సహకారంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025