November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

ఏలూరు టిడిపిలో నుంచి వైసిపిలోకి ఘర్ వాపసి –

పునరాలోచనలో పడుతున్న తెలుగు తమ్ముళ్లు?? ఎన్నికల నాటికి పూర్తి ఆధిక్యం పొందేలా ఆళ్ల నాని రాజకీయ వ్యూహం.?*

*నియోజకవర్గంలో జరిగిన 400కోట్ల రూపాయల అభివృద్ధి – సంక్షేమమే ప్రధాన అంశంగా ఆళ్ల నాని ఎన్నికల ప్రచారం – అందుబాటులో ఉండటమే అంశంగా బడేటి చంటి ఎన్నికల ప్రచారం*

ఏలూరు,ఏప్రిల్10: ఎన్నికల వేళ రాజకీయ పార్టీల్లో నాయకులు ఇటు అటు మారడం సహజంగా జరిగే పరిణామం. అయితే ఏలూరు నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కొంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఏలూరు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో అధికార వైసిపి అభ్యర్ధిగా మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని రంగంలో ఉండగా, మరో వైపు టిడిపి కూటమి అభ్యర్ధిగా బడేటి రాధా కృష్ణయ్య(చంటి) పోటీ చేస్తున్నారు.
అయితే సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న బడేటి కుటుంబం తరపున కూటమి అభ్యర్ధిగా, దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆశయాలను కొనగిస్తానని ఆయన సోదరుడు చంటి ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి వెళ్తుండగా, మరోవైపు ఏలూరు నియోజక వర్గంలో జరిగిన సుమారు 400కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ పనులను వివరిస్తూ, ఒక్క ఏలూరు నియోజకవర్గ పరిధిలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ది పొందిన దాదాపు లక్షమంది పైగా ప్రజల ఆశీర్వాదాలే లక్ష్యంగా ఆళ్ల నాని తన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు..
ఈ నేపథ్యంలోనే బుజ్జన్న సాక్షిగా అందుబాటులో ఉంటానని కూటమి అభ్యర్థి బడేటి చంటి ప్రచారం చేస్తుంటే,  గతంలో టిడిపి హయాంలో ఏలూరు నగరంలో జరిగిన హత్యలు, సెటిల్మెంట్ వివాదాలను ఫోకస్ చేస్తూ “ప్రశాంతమైన ఏలూరు కావాలి అంటే ఆళ్ల నాని యే మళ్ళీ రావాలి” అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
తాజాగా ఎన్నికల వేల నాయకులు పార్టీలు మారడం సహజంగానే ప్రజలు చూస్తూ ఉంటారు. అధికారం ఉన్న 5 ఏళ్లు పదవులు అనుభవించి, ఎన్నికల ముందు పార్టీలు మారి ప్రజల కోసమే మారాం అని చెప్పటం నాయకుల సహజ లక్షణం..
అయితే ఏలూరులో మాత్రం ఎన్నికల షెడ్యుల్ విడుదల అయ్యాక వైసిపిని వీడి టిడిపిలో చేరిన కొందరు నాయకులు 24గంటల్లోనే తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ ఆళ్లనాని సమక్షంలో వైసిపిలో చేరుతున్నారు. అయితే టిడిపిలో చేరిన నాయకులు క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ఓటింగ్ శాతం ఆళ్లనానికి అధికంగా ఉందని తెలియడం, ఏలూరు టిడిపిలో చేరికను తమ వర్గాల ప్రజలు తిరస్కరించడంతో, అక్కడ ఎక్కువ కాలం ఇమడలేమనీ నిర్ధారించుకుని సదరు నాయకులు తిరిగి వైసిపి గూటికి చేరుతున్నారని వైసిపి నాయకులు అంటున్నారు.
అయితే రాబోయే  రోజుల్లో ఆళ్ల నాని ఎన్నికల ప్రచారం మరింత విస్తృతంగా చేపట్ట నుండటంతో పలువురు నాయకులు మరోసారి వైసిపి బాట పట్టనున్నట్లు వైసిపి నాయకులు పేర్కొంటున్నారు.
అయితే ఏలూరు టిడిపిలో చేరిన వైసిపి నాయకులు తిరిగి 24గంటల్లోనే మళ్ళీ వైసిపి లోకి వెళ్లిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది..

Also read

Related posts

Share via