రోడ్లపై ప్రయాణికుల భద్రత దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు ఒక్కోసారి కఠినంగా వ్యవహరిస్తుంటారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగంగా రోడ్లపై వెళ్లడం వంటి వాటి విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటారు. ఈ క్రమంలో చలాన్లు విధించడం, వాహనాలను స్వాధీనం చేసుకోవడం కూడా చేస్తుంటారు. అయితే తాజాగా అతివేగంతో వెళ్తున్న ఓ యువకుడిని ఆపి పోలీసులు బైక్‌ణు స్వాధీనం చేసుకొని..
శంషాబాద్, సెప్టెంబర్ 11: రోడ్లపై ప్రయాణికుల భద్రత దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు ఒక్కోసారి కఠినంగా వ్యవహరిస్తుంటారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగంగా రోడ్లపై వెళ్లడం వంటి వాటి విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటారు. ఈ క్రమంలో చలాన్లు విధించడం, వాహనాలను స్వాధీనం చేసుకోవడం కూడా చేస్తుంటారు. అయితే తాజాగా అతివేగంతో వెళ్తున్న ఓ యువకుడిని ఆపి పోలీసులు బైక్‌ణు స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. దీంతో మనస్తాపం చెందని సదరు యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ మండలం తొండుపల్లి టోల్‌గేట్ వద్ద మంగళవారం (సెప్టెంబర్ 10) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ మండలం తొండుపల్లి టోల్‌గేట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్‌పై అతివేగంతో వస్తున్న యువకుడిని ఆపి చెక్ చేశారు. అనంతరం బైక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దానిని స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆ యువకుడు బండి తిరిగివ్వకుంటే చనిపోతానంటూ పోలీసులను భయపెట్టాడు. రోడ్డుపై పరుగులు తీస్తూ వాహనాలకు అడ్డుగా వెళ్లాడు. పోలీసులు దొరక బుచ్చుకోవడంతో శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పి, అతడిని కాపాడారు. ఈ ఘటనలో యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. యువకుడిని నాగర్‌కర్నూల్‌కు చెందిన శివగా గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, రోడ్డుపై ప్రమాదకర రీతిలో వేగంగా బైక్ నడిపినట్లు పోలీసులు తెలిపారు. గతంలో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో అతడు నిందితుడుగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడు శివపై కేసు నమోదు చేసి, 108లో శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు.
మెదక్ సర్కిల్ శివంపేట సెక్షన్ ఏఈపై సస్పెన్షన్ వేటు
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లువెత్తుతున్నాయి. దీనిలో భాగంగా మెదక్ సర్కిల్ శివంపేట సెక్షన్ అసిస్టెంట్ ఇంజినీర్ బి. దుర్గాప్రసాద్‌ను మంగళవారం అధికారులు సస్పెండ్ చేశారు. ఓ పనికి సంబంధించి వర్క్ ఆర్డర్ విడుదల చేయడానికి దుర్గాప్రసాద్ లంచం డిమాండ్ చేసినట్లు కాల్ సెంటర్‌కు ఫిర్యాదు వచ్చింది. విచారణలో ఆరోపణలు రుజువుకావడంతో చర్యలు తీసుకున్నారు. కాగా గతంలోనూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడినందుకు విద్యుత్తు సంస్థలో 19 మందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. విద్యుత్తు సిబ్బంది ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే 040-2345 4884, 7680901912 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ మీడియాకు తెలిపారు
తాజా వార్తలు చదవండి
- Sun Transit: గ్రహ రాజు రవి అనుకూలత.. ఆ రాశుల వారికి సమస్యల నుంచి విముక్తి
- Vastu tips for Mirror: ఇంట్లో వాస్తు దోషాలున్యాయా.. బెస్ట్ రెమిడీ అద్దం అని మీకు తెలుసా..!
- Andhra News: తండ్రి కోసం బుల్లెట్ బైక్ కొన్న కూతురు.. కానీ బైక్ తండ్రికి ఇచ్చేలోపే….
- Wearing Toe Rings: వివాహిత స్త్రీ కాలి మెట్టెలు పోగొట్టుకుంటే.. భర్తకు సంబంధించిన ఈ సంకేతాలకు సూచనట
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు