తానే లేకపోతే అమ్మను ఎవరు చూస్తారని… కన్నతల్లిని హత్య చేసి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను లేకపోతే కన్నతల్లిని ఎవరు చూసుకోరేమో అని ఆలోచనతో ఆమెను కడతేర్చాడు. అనంతరం ఆమె శవం ప్రక్కనే ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడిన ఘటన కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బూడిదిగడ్డ ఏరియాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బూడిదగడ్డ ఏరియాలో నివసిస్తున్న 55 సంవత్సరాల తుల్జా కుమారికి కుమార్తె హారతి, కుమారుడు వినయ్ కుమార్ (27) ఉన్నారు. పదేళ్ల క్రితం ఆమె భర్త మరణించాడు. కుమార్తె హారతి వివాహం అనంతరం అత్తారింటికి వెళ్లిపోయింది. కుమారి ఆ తర్వాతి నుంచి కొడుకుతో కలిసి నివాసం ఉంటుంది. కొంతకాలం క్రితం తుల్జా కుమారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మందులు వాడుతున్నారు. వినయ్ కుమార్ గతంలో అక్కడక్కడ పనిచేసి తల్లికి ఆసరాగా ఉండేవాడు. రెండేళ్ల నుంచి ఏ పని చేయడం లేదు. అప్పటినుంచి తుల్జాకుమారి, వినయ్ కుమార్ పోషణకు బంధువులు సాయపడేవారు.
ఇటీవల వినయ్ కుమార్ అనారోగ్యానికి (హైడ్రో సెల్) గురయ్యాడు. అలర్జీ ఉండడం వల్ల ఇప్పట్లో శస్త్ర చికిత్స చేయడం కుదరదని, కొన్ని రోజులు మందులు వాడాలని వైద్యులు సూచించారు. దీంతో అతను డిప్రెషన్‌కు లోనయ్యాడు. ‘ఇక నేను ఉండను… నాకు బతకాలని లేదు’ అంటూ స్నేహితులకు చెప్పేవాడు. మానసికంగా దెబ్బతినడంతో నాకేమైనా అయితే మా అమ్మ ఒంటరిది అయిపోతుంది .. ‘నేను లేకపోతే మా అమ్మకు తోడు ఎవరుంటారు…?’ అంటూ తనలో తానే మాట్లాడుకునేవాడు. అదే ఆలోచనలో ఉన్న వినయ్ కుమార్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో తల్లి నిద్రిస్తుండగా ఇనుపరాడ్‌తో తలపై కొట్టి హత్య చేశాడు. ఆమె శవం పక్కనే దూలానికి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లీకొడుకు చనిపోవడంతో బస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also read :TCyber Crime: సీబీఐ అధికారులమంటూ మహిళకు రూ.26లక్షలు టోకరా..
తెలంగాణలో మరో భారీ స్కాం.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై కేసు!
Hyderabad: తాగి రూమ్‌కి రావొద్దన్నందుకు.. కత్తితో పొడిచి హాస్టల్ మేట్‌ను చంపేశాడు