June 29, 2024
SGSTV NEWS
CrimeTelanganaViral

పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ అడిగిన వారితో గొడవ పెట్టుకున్న యువతీ యువకుడు

Video: సమాజం తలదించుకునేలా నడిరోడ్డుపై యువతి రచ్చ!
మారుతున్నసమాజంలో యువత కూడా మారిపోతుంది. కొందరు తమ అభ్యున్నతి వైపు వెళ్తుంటే మరికొందరు మాత్రం చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. అంతేకాక చెడు చేస్తుంటే అడ్డు చెప్పే వారిపైనే వాగ్వాదానికి దిగుతున్నారు. తాజాగా నడిరోడ్డుపై ఓయువతి రచ్చ చేసింది.

యువతరం అనేది  దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంతో మంది యువత కూడా తమదైన ప్రతిభా, నైపుణ్యంతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొందరు యువత మాత్రం మద్యం, మాదద్రవ్యాలను వినియోగిస్తూ పెడదారి పడుతున్నారు. సమాజంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే తల్లిదండ్రుల కలలును కన్నీరుగా మిగులుస్తున్నారు. కొందరు యువత మద్యం మత్తులో చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాక మద్య మత్తులో రోడ్డు ప్రమాదాలు చేసి..అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. మద్యం తాగొద్దని చెప్పే వారిపైనే ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా ఓ యువతి యువకుడు నడిరోడ్డుపై మద్యం తాగుతూ హంగామా సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

మారుతున్నసమాజంలో యువత కూడా మారిపోతుంది. కొందరు తమ అభ్యున్నతి వైపు వెళ్తుంటే మరికొందరు మాత్రం చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. అంతేకాక చెడు చేస్తుంటే అడ్డు చెప్పే వారిపైనే వాగ్వాదానికి దిగుతున్నారు. మరికొన్నిచోట్ల అయితే కొందరు ఏకంగా దాడులకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో ఎదుటివారిపై దాడులకు తెగపడి..ప్రాణాలు తీస్తున్నారు. ఇలా మద్యం తాగి వీరంగ సృష్టించే వారిలో యువతులు కూడా ఉండటం గమన్హారం. మద్యం తాగి యువతులు నడిరోడ్డుపై రచ్చ చేసిన ఘటనలు మనం అనేకం చూశాం. తాజాగా మరో యువతి కూడా అదే స్థాయిలో మద్యం మత్తులో రెచ్చిపోయింది. పబ్లిక్ ప్లేస్ లో మద్యం తాగొద్దని చెప్పిన పెద్దవారిని చెప్పలేని భాషలో తిడుతూ రచ్చ చేసింది. ఆమెతో పాటు బీరు తాగుతో మరో యువకుడు కూడా ఉన్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఈ యువతి, యువకుడికి చేసిన హంగామాకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యువతి హల్ చల్ సృష్టించింది. శుక్రవారం ఉదయం ఆరుగంటల సమయంలో హైదరాబాద్ నగరంలోని నాగోల్ ప్రాంతంలో ఫాతులా గూడ రోడ్డులో యువతి, యువకుడు మద్యం  సేవిస్తున్నారు. అటుగా వెళ్తున్న వారు.. ఆ జంటను గమనించారు. అంతేకాక ఇక్కడ తాగొద్దు ఆ యువతి యువకుడికి సూచించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ స్థానికులు చెప్పారు. అలా చెప్పిన వారిపై మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఇక్కడ మద్యం తాగొద్దని చెప్పిన వారిపై చెప్పలేని పదాలతో బూతులు తిట్టింది. వీరి చేసిన రచ్చ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యింది. అంతేకాక ఈ యువతీ యువకులపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

https://x.com/AduriBhanu/status/1794013412726640670?t=TvuqSIqhhz6P3dgtpBSh-Q&s=19

Also read

Related posts

Share via