ఫీజులు,వసతులు, ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా విద్యార్ధుల ఆందోళనలు పరిపాటి. కానీ వనస్థలిపురంలో స్టూడెంట్స్ న్యూసెన్స్ చేస్తున్నారంటూ నారాయణ కాలేజీ ఎదుట ఆందోళన దిగారు కాలనీ వాసులు. పిల్లలకు చదువులు చెప్తున్నారా? లేదంటే బూతులు నేర్పిస్తున్నారా? అని కన్నెర్ర చేశారు కాలనీ మహిళలు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి…
హైదరాబాద్ వనస్థలిపురం సామనగర్‌లో నారాయణ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు కాలనీ వాసులు. హాస్టల్ విద్యార్థులు కిటికీల దగ్గర కూర్చొని పిచ్చి కూతలు, రోత చేష్టలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇళ్లలోకి పేపర్ రాకెట్లు విసిరేస్తున్నారని .. లైజర్ లైట్లతో ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు దుస్తులు లేకుండా అసభ్యంగా తిరుగుతున్నట్లు మహిళలు చెబుతున్నారు
హాస్టల్ స్టూడెంట్స్ ఆగడాల వల్ల ఇంటి నుంచి బయటకు రావాలన్నా.. ఇంట్లో వుండాలన్నా భయం వేస్తుందని వాపోయారు మహిళలు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కాలేజీ మేనేజ్‌మెంట్ నుంచి కనీస స్పందన రాలేదన్నారు.
గొడవ విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. స్థానికులతో, కాలేజీ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడారు. ఇక్కడి నుంచి కాలేజీ హాస్టల్‌ను షిప్ట్ చేయాల్సిందేనని పోలీసులకు తేల్చి చెప్పారు మహిళలు. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..