November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

Telangana: ఇదిగో చిత్రవిచిత్రంగా కనిపిస్తున్న ఈ కారు ఓ స్మశానం వద్ద ఆగింది.. ఆ తర్వాత



అఘోరాల గురించి మనం అప్పుడప్పుడు వింటునే ఉంటా. శివునిపై అపారమైన భక్తితో ఆ దిగంబరునికి తమ జీవితాన్ని అకింతం చేస్తారు వీళ్లు. బంధాలు, బంధుత్వాలను త్వజించి.. శివ నామ స్మరణలో లీనమైపోతుంటారు. ఒళ్లంతా విభూదితో.. రుద్రాక్ష మాలలతో.. జటాజూటాలతో.. తపస్సులో కనిపిస్తుంటారు. వీరు అత్యంత అరుదుగా మాత్రమే జనాల మధ్యకు వస్తారు.


డేంజర్… అఘోరీ… నాగసాధు అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉన్న కారు అది. కారు డాష్ బోర్డుపై పుర్రెలు పెట్టి ఉన్నాయి. సడన్‌గా ఓ శ్మశాన వాటిక లోపలకు వెల్లిందా కారు… అప్పుడే చితి అంటించిన శవం కాలుతోందక్కడ… కారులోంచి దిగిన మహిళా అఘౌరీ ఆ చితి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. చితికి ఇరువైపులా పూజలు చేస్తూ దేవున్ని ప్రార్థించింది. కాలుతున్న చితి కింది భాగం నుండి బూడిదను తీసుకుని తన ఒళ్లంతా రాసుకుంది. చితికి నాలుగు దిక్కులా తిరుగుతూ బూడిద కలిసిన మట్టిని తీసుకుని ఆకాశంపైకి విసురుతూ పూజలు చేసింది. అక్కడి నుండి బయలు దేరింది.


తెలంగాణాలో తిరుగుతున్న మహిళా అఘౌరీ (నాగసాధు) జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకుంది. ఆలయంలో పూజలు నిర్వహించిన అఘోరీ వెంట వచ్చిన వారు.. అంతకు ముందు శ్మశానంలో శవం వద్ద చేసిన ప్రార్థనలకు సంబంధించిన వీడియోను మీడియాకు ఇచ్చారు. కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మహిళా అఘౌరీ లోక కళ్యాణం కోసమే ఆలయాల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. త్వరలో కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేకంగా ఓ ఆశ్రమం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వివరించిన ఆమె.. మానవ సేవ కంటే ప్రకృతి సేవే ముఖ్యమన్నారు. ఆలయాల సందర్శనలో భాగంగా తాను తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నానని రాష్ట్రంలోని అన్ని క్షేత్రాలను దర్శించుకుంటానని వెల్లడించారు. హరిద్వార్ క్షేత్రం నుండి తాను దేవాలయాలను సందర్శించేందుకు బయలుదేరినట్టుగా వెల్లడించారు. ఇటీవల సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఈ అఘౌరీ నేడు కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం గమనార్హం.

కాశీ, హరిద్వార్ వంటి అత్యంత ప్రాశస్త్యం ఉన్న శైవ క్షేత్రాల సమీపంలో జనారణ్యం లేని చోట మాత్రమే నివాసం ఉంటారు అఘోరాలు, అఘోరీలు. నిత్యం శివనామస్మరణ చేస్తూ శరీరమంతా విభూది పూసుకుని కాలం వెల్లదీస్తుంటారు. వీరు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ప్రత్యేకతలు ఉన్న రోజులు మాత్రమే ఉంటాయి. వీరంతా అవాసం ఉన్న సమీప క్షేత్రంలోని శంకరున్ని దర్శించుకోవాలన్నా కూడా ప్రత్యేక సమయంలో వస్తారని ఆయా క్షేత్రాల్లో చెప్తుంటారు. వీరు మహాకుంభమేళ, కుంభమేళ జరిగినప్పుడు మాత్రమే ఆ నది తీరాల్లో ప్రత్యక్ష్యం అయి ఉత్సవాలు ముగిసే వరకు ఉండి అంతర్థానం అవుతారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పటి వరకు అఘౌరాలు అనగానే పురుషుల గురించి మాత్రమే ఉంటారన్న ప్రచారం జరిగింది. కానీ తాజాగా తెలంగాణలోని వివిధ పుణ్యక్షేత్రాలు మహిళా అఘౌరీ సందర్శిస్తుండడం గమనార్హం. కొండగట్టు లో ఈ అఘౌరీ పూజలు నిర్వహించేందుకు రావడం ప్రత్యేకతను సంతరించుకున్నట్టయింది. మొత్తానికి ఆ వాహనం చూసి భక్తులు భయపడుతున్నారు

Also read

Related posts

Share via