July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

తెలంగాణ : అన్నను సైడ్ చేసి.. వదినతో మరిది కాపురం.. ఇద్దరు పిల్లలు పుట్టాక ఊహించని ట్విస్ట్..

కాలం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ధర్మం అనేది లేదు.. న్యాయం కనిపించడం లేదు. ఎక్కడ చూడు మోసాలు, అన్యాయాలు. కొందరైతే వావి వరసలు కూడా మర్చిపోయి.. విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తున్నారు. ఇది అలాంటి ఘటనే. వివరాలు తెలుసుకుందాం పదండి…

ఇది మైండ్ బ్లాంక్ అయ్యే వార్త . భర్తలో లోపం ఉండి పిల్లలు పుట్టకపోవడంతో.. మరిదితో కాపురం చేయించారు అత్తామామలు.  దీంతో వారిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమెకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు కుటుంబ సభ్యులు. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకా వివరాలు తెలుసుకుందాం పదండి.  న‌ల్లబెల్లి మండ‌లంలోని బజ్జుతండా శివారు చిన్నతండాకు చెందిన యువ‌కుడికి ఎల్లాయగూడానికి చెందిన యువ‌తితో 2017లో పెద్దలు వివాహం చేశారు. అయితే.. నెలలు గడిచిపోతున్నా పిల్లలు కలగకపోవడంతో.. దంపతలు ఆస్పత్రికి వెళ్లారు. ఇద్దరికీ టెస్టులు చేసిన డాక్టర్లు.. భర్తలో లోపం ఉందని.. అతనికి పిల్లలు కలగరని క్లారిటీ ఇచ్చారు. దీంతో.. పిల్లలు లేకుండా దాంపత్య జీవితం తనకు అక్కర్లేదని.. పుట్టింటికి వెళ్లింది ఆమె. తమ కొడుకు.. గురించి కోడలు బయటకు అందరికీ చెబుతుంది అని భావించారో,  ఏమో.. అత్తామామ మరిది కలిసి.. వాళ్ల ఇంటికి వెళ్లి పిల్లలు పుట్టేందుకు ఆస్పత్రిలో చూపిస్తామని చెప్పి మళ్లీ మెట్టినింటికి తీసుకొచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్.. భర్తతో ఎలాగూ పిల్లలు పుట్టరు కాబట్టి.. మరిదితో కాపురం చేయాలన్నారు. మన కుటుంబం పరువు బజారు పాలు కాకుండా చూడాలని వేడుకున్నారు. ఉన్న ఆస్తిపాస్తులు కూడా మనకే చెందుతాయని.. రకరకాల మాయమాటలు చెప్పి ఆమెను మరిదితో కాపురానికి ఒప్పించారు.

ఇక వాళ్లు చెప్పినళ్లుగా.. తతంగం అంతా జరిగింది. వదిన మరుదుల కాపురానికి ఫలితంగా.. ఇద్దరు బిడ్డలు జన్మించారు. అయితే.. ఇన్నాళ్లుగా ఇంట్లో చప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిచింది. అయితే ఇంట్లో కొద్ది రోజులుగా అభిప్రాయ బేధాలు తలెత్తుతున్నాయి. ఈ గొడవల్లో భాగంగా.. పుట్టింటికి వెళ్లిపోవాలని ఆమెను టార్చర్ పెట్టారు. మధ్యలో ఒకసారి తనపై దాడి చేశారు. దీంతో..తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ సమయంలోనే.. వేరే అమ్మాయితో మరిదికి పెళ్లి చేయాలని ప్లాన్ చేశారు. ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. ఈ విష‌యం తెలుసుకున్న మ‌హిళ.. అత్తారింటికి వచ్చి నిలదీసింది. దీంతో అత్తింటివారు ఆమెను తిట్టి పంపించడంతో.. న‌ల్లబెల్లి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దర్యాప్తులో భాగంగా.. అత్తింటివారిని విచారిస్తే… అలాంటిదేం లేద‌ంటున్నట్లు పోలీసులు చెప్పారు. కేసు విచార‌ణ‌లో భాగంగా అవ‌స‌ర‌మైతే పిల్లలకు DNA టెస్టులు నిర్వహించేందుకు అనుమ‌తులు తీసుకుంటామని పోలీసులు తెలిపారు

Also read

Related posts

Share via