వరంగల్‌లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనలో సెన్సేషనల్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యే సుమంత్ రెడ్డి మర్డర్ కోసం ప్లాన్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా తన ప్రియుడు సామ్యూల్‌తో కలిసి భర్తను అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ గీసింది. దీనికి ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
వరంగల్‌లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనలో సెన్సేషనల్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యే సుమంత్ రెడ్డి మర్డర్ కోసం ప్లాన్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా తన ప్రియుడు సామ్యూల్‌తో కలిసి భర్తను అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ గీసింది. దీనికి ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఫిబ్రవరి 19న వరంగల్ – బట్టుపల్లి ప్రధాన రహదారిపై డాక్టర్ సుమంత్‌పై దాడి జరిగింది. కారులో వెళ్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కారుకు ముగ్గురు వ్యక్తులు కారుకు అడ్డు వచ్చి.. కారును ఆపారు. ఆయనను కారులో నుంచి కిందకు లాగి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని స్థానికుల సహాయంతో కొన ఊపిరితో ఉన్న బాధితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దాడికి పాల్పడిన వారు ఎవరు? వైద్యుడు సిద్దార్ధ్‌ను ఎందుకు చంపాలనుకున్నారు? వ్యక్తిగత కక్ష్యలు ఏమైనా ఉన్నాయా? లేక గంజాయి బ్యాచ్ ఏమైనా డాక్టర్‌పై దాడికి పాల్పడిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే.. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..
డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డిలో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు. ఆ సమయంలో అతడి భార్య ఫ్లోరా ఓ జిమ్‌లో జాయిన్ అయింది. అక్కడే ఆమెకు జిమ్ ట్రైనర్ సామ్యూల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో వరంగల్‌కు షిఫ్ట్ అయిపోయారు. సుమంత్ కాజీపేటలో క్లినిక్ పెట్టుకున్నారు. ఫ్లోరా రంగశాయిపేటలోని డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ అయింది.
మరోవైపు ప్రియుడు సామ్యూల్‌తో ఫ్లోరా టచ్‌లోనే ఉంది. భర్త సుమంత్‌ను చంపేస్తే ఇద్దరం కలిసి ఉండవచ్చని ఫ్లోరా, సామ్యూల్ నిర్ణయించుకున్నారు. వీరి మర్డర్ ప్లాన్‌కు ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహాయం చేశాడు. సుమంత్ ను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేశారు. యాక్సిడెంట్ ప్లాన్ విఫలం అవడంతో ఐరన్ రాడ్లతో కొట్టి చంపేందుకు ప్లాన్ బీ.. వేశారు. ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రోడ్డు పై వస్తుండగా ప్లాన్ అమలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు
Also read
- Big breaking : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై కేసు
- Crime: కొంపముంచిన మద్యం.. రైలుకింద నలిగిపోయిన అందమైన కుటుంబం!
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
- Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..