తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాలుడిని నిరుపేద ఆదివాసి కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు బధ్రు, తల్లి లక్ష్మి కన్నీరు మున్నిరుగా విలపిస్తూ, వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
సల సల మరిగే వేడినీళ్లలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఒళ్లంతా ఖాలిన గాయాలతో రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన రెండేళ్ల బాలుడు ఓడిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చివరి క్షణంలో ఆ పసిబాలుడి ఆర్తనాదాలు ప్రతి ఒక్కరి హృదయాలను చలించివేసింది. ఈ ఘటన ములుగు జిల్లాలో జరిగింది.
వెంకటాపురం మండలం శాంతినగర్ గ్రామంలో నవంబర్ 27వ తేదీన సాయంత్రం దేవిప్రసాద్ అనే రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వేడి నీళ్ళ బకెట్లో పడ్డాడు. ఆ నీళ్లు సల సలా మసులుతుందడంతో ఒళ్ళంతా కాలి తీవ్ర గాయాలయ్యాయి. బొబ్బలు ఎక్కి చర్మమంతా ఒలిచినట్లు అయింది. 80శాతం కాలిన గాయాలతో ఉన్న బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులపాటు మృత్యువుతో పోరాడిన బాలుడు, చివరికి ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాలుడిని నిరుపేద ఆదివాసి కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు బధ్రు, తల్లి లక్ష్మి కన్నీరు మున్నిరుగా విలపిస్తూ, వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలుడు పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుండి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు. రెండు రోజులు పాటు మృత్యువుతో పోరాడిన బాలుడు మృతి చెందాడు. ఆడుతూ పాడుతూ తిరిగిన బాలుడి మృతితో శాంతినగర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కన్నవారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025