కరీంనగర్ జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొంది.. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. తిమ్మాపూర్‌లోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృత్యువాత పడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొంది.. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. తిమ్మాపూర్‌లోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృత్యువాత పడింది. చొప్పదండి మండలం రుక్మాపూర్ కు చెందిన ముద్దసాని అఖిల.. ఉస్మానియా యూనివర్సిటిలో పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్లింది.. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలోని అయాన్ డిజిటల్ జోన్ లో పీజీ ప్రవేశ పరీక్ష రాసిన అనంతరం భర్తతో కలిసి.. తిరిగి వస్తుండగా హైదరాబాద్ – రామగుండం రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైంది. గుర్తు తెలియని వాహనం అఖిల దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.. దీంతో దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. అఖిల రోడ్డుపై మధ్యలో పడిపోవడంతో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమె తలపై నుండి వెళ్లింది.. దీంతో అక్కడిక్కడే మృతి చెందింది.
కాగా అఖిలకు మూడు రోజుల క్రితమే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం అయింది. పెళ్లి తర్వాత కుటుంబంతో ఎంతో ఆనందంగా ఉండాల్సిన సమయంలో అఖిల మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అఖిల కాళ్లకు పెట్టిన పారాణి కూడా పూర్తిగా ఆరక ముందే ముందే, కానరాని లోకాలకు వెళ్ళింది.
కాగా.. ఈ ఘటనకు ముందు ఇంటి వద్ద కూతురు రాక కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. నల్ల పూసలు కుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే విషాద వార్త. రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయిందని తెలియడంతో కుటుంబసభ్యులు కుప్ప కూలిపోయారు. ఎంతో సంతోషంగా ఇంటి నుంచి వెళ్లిన కూతురు విగత జీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు తట్టుకోవడం లేకపోతున్నారు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also read
- వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి చూడగా..
- పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు.. రెప్పపాటులో స్కూటీ డిక్కీలో రూ.8 లక్షలు మాయం..!
- నడిరోడ్డుపై బైక్పై విన్యాసాలు వద్దన్న పాపానికి.. వాహనదారులపై రెచ్చిపోయిన పోకిరిలు..!
- Ugadi Rasi Phalalu: పరాభవనామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయం, వ్యయంతో పాటు అదృష్ట సంఖ్యలు, రోజులు వివరాలు!
- Lifestyle: రాత్రి నిద్ర పట్టడం లేదా? ఈ ఒక్క మంత్రం చదివితే చాలు గాఢ నిద్రలోకి.. అద్భుతమైన ఫార్మూలా!





