చేవెళ్ల మండలం దామరగిద్దలో ఇద్దరు చిన్నారులు పార్క్ చేసిన కారులో ఇరుక్కుని.. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబ ఆవేదనకు అంతులేకుండా పోయింది. పోలీసులు స్పాట్‌కు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు డోర్లు లాక్ అవడంతో లోపల ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే… చేవెళ్ల మండలం పామన గ్రామానికి చెందిన వెంకటేష్ జ్యోతి దంపతుల కూతురు తన్మయ శ్రీ (5), షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఉమారాణి దంపతుల కూతురు అభినయశ్రీ (4) మరణించడంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిపోయాయి. చనిపోయిన తన్మయశ్రీ, అభినయశ్రీ వరుసకు అక్కాచెల్లెళ్లు అవుతారు ఈ నెల 30న తమ మేనమామ వివాహం ఉండడంతో అమ్మమ్మ గారి ఇంటికి వచ్చిన పిల్లలు.. ఈ విధంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
బాలికలు ఇద్దరూ.. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లారు. వారు ఎక్కిన తర్వాత డోర్లు లాక్ అయిపోయాయి. దీంతో లోపల ఇరుక్కుపోయిన చిన్నారులు ఊపిరి అందక ఈ లోకాన్ని వీడారు. బాలికలు చాలాసేపటి నుంచికనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆ ప్రాంతమంతా వెతికినా కనిపించలేదు. చివరకు కారులో అపాస్మారక స్థితిలో కనిపించడంతో.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
చిన్నారులు మృతి చెందారనే విషయం తెలిసి.. ఆ గ్రామమంతా తల్లడిల్లిపోయింది. చిన్నారుల తల్లిదండ్రులు బోరున విలపించడం చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు. లోకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపిల్లల్ని ఎప్పుడూ ఓ కాపు కాస్తూ ఉండాలి. లేదంటే ఇలాంటి దారుణాలే జరుగుతాయి
Also read
- కార్తీక అమావాస్య వచ్చేస్తుంది.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!
- Nail Cutting: ఏ రోజున గోర్లు కట్ చేస్తే మీ అదృష్టం దూరం అవుతుందో తెలుసా?
- Hyderabad: బటన్ నొక్కగానే డోర్ ఓపెన్ అయింది.. కానీ లిఫ్ట్ రాలేదు.. పాపం ఆయన వచ్చిందనుకుని
- అన్న బయటకు పోగానేే.. వదినతో కులుకుతున్నాడు.. విషయం అతనికి తెలియడంతో..
- స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం – తల్లిదండ్రుల ఫిర్యాదు – తిరగబడిన స్కూల్ టీచర్లు





