కొన్ని నెలల క్రితం చెడ్డి గ్యాంగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. అపార్ట్మెంట్లనే లక్ష్యంగా చేసుకుని చెడ్డి గ్యాంగ్ అలజడి సృష్టించింది. ఇప్పుడు కొత్తగా చుడీదార్ గ్యాంగ్ దిగింది.
సమాజంలో సరైన ఉపాధి అవకాశాలు, సంపాదించుకునే సరైన మార్గాలు లేనప్పుడు అరచాకాలు పెరిగిపోతుంటాయి. అక్రమ మార్గంలో ధనం సంపాదించేందుకు ప్రయత్నించే వారి సంఖ్య పెరిగిపోతుంది. కారణాలు ఏమైనప్పటికీ సమాజంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. అంతేకాక వివిధ రకాల గ్యాంగ్ లు హల్ చల్ చేస్తూ జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెడ్డి గ్యాంగ్ సృష్టించిన కలకం అంతాఇంతా కాదు. తాజాగా చుడీదార్ గ్యాంగ్ అనేది జనాలను కలవర పెడుతోంది.
కొన్ని నెలల క్రితం చెడ్డి గ్యాంగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. అపార్ట్మెంట్లనే లక్ష్యంగా చేసుకుని చెడ్డి గ్యాంగ్ అలజడి సృష్టించింది. పలువురు చెడ్డీలు ధరించి, శరీరానికి నూనె పూసుకుని ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వారు దొంగతనం చేసే సమయంలో అడ్డు వచ్చిన వారి అతి కిరాతకంగా చంపిన సందర్భాలు ఉన్నాయి. అయితే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో చెడ్డి గ్యాంగ్ ఆగడాలు తగ్గాయి. ఇక చెడ్డి గ్యాంగ్ బాధ తొలగిందని జనాలు భావిస్తున్న వేళ మరో గ్యాంగ్ సిటీలోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా చుడీదార్ బ్యాచ్ ఒకటి హైదరాబాద్ నగరంలో హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్‌లో చెడ్డి గ్యాంగ్ తరహాలో కొత్తగా చుడీదార్ గ్యాంగ్ కలకలం సృష్టిస్తుంది.
హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ ప్రాంతంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మహిళల వేషధారణలో అపార్టు మెంట్లోకి వెళ్లి తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెక్కాలనీ ఆకృతి ఆక్రేడ్లోలోని 502 అనే ప్లాట్ లో వెంకటేశ్వర్రావు అనే ఓ ప్రైవేటు ఉద్యోగి ఉంటున్నారు. అదే అపార్టు మెంట్లోని వేరే ప్లాట్ లో ఆయన కూతురు, అల్లుడు కూడా నివాసం ఉంటున్నారు. ఈనెల16వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి వెంకటేశ్వర్రావు కుటుంబంతో కలిసి ఒంగోలు వెళ్లారు
ఈ క్రమంలోనే 18వ తేదీ ఉదయం వెంకటేశ్వరావు వాళ్ల ఫ్లాట్ కి పని మనిషి వెళ్లింది. అక్కడి వెళ్లి చూడగా వెంకటేశ్వరావు ఇంటి తాళం పగులగొట్టి ఉండాన్ని గమనించింది. అంతేకాక ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా..సామాగ్రి అంతా చిందరవందరగా పడిఉన్నాయి. చోరీ జరిగినట్లు అర్థమవడంతో వెంటనే వెంకటేశ్వరావుకు, ఆయన కుమార్తెకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చింది. వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదే సమయంలో అపార్ట్మెంట్ లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. 18వ తేదీ తెల్లవారుజాము సమయంలో చుడీదార్ వేసుకున్న మహిళల ముసుగులు ఇద్దరు దుండగలు అపార్మెంట్ లోకి ప్రవేశించారు. అనంతరం వెంకటేశ్వర్ రావు నివాసం ఉండే 502 ఫ్లాట్ తాళం పగులగొట్టి ఇంట్లోని బీరువాలో దాచిన 4 తులాల బంగారం, లక్ష నగదు, ఓ ల్యాప్ టాప్ చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకూ చెడ్డి గ్యాంగ్ కి భయంతో జనం వణికిపోతుంటే.. కొత్తగా ఈ చుడీ దార్ గ్యాంగ్ రావడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ చోరీలను అరికట్టాలనే పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు.
Also read
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!