గ్రామాల్లో చాలా వరకు రైతులు పొలాలకో, లేదా కూళీలకు వెళ్లే టప్పడు ఇళ్లు తాళం వేసి తాళం చెవి ఇంటి గుమ్మం గూటిలోనో, లేదా పూలకుండీలలో పెట్టి వెళ్తుంటారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఇలాంటి పద్దతే కొనసాగుతుంది. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇలానే ఓ ఇంటి గుమ్మంలో పెట్టిన తాళాన్ని తీసుకొని ఇంటిని మొత్తం దోచుకున్నారు. మళ్లీ ఏమి ఎరగనట్టు తాళం అక్కడే పెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.
అలవాటు ప్రకారం ఇంటి గుమ్మం గూట్లో తాళంపెట్టి పనికిపోయిన ఒక మహిళకు ఊహించని షాక్ తగిలింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి దొంగలు వాళ్ల ఇంటిని మొత్తం గుళ్ల చేశారు. ఇంట్లో ఉన్న బంగారంతో పాటు నగదును మొత్తం దోచుకెళ్లారు. బీరువాలో ఉన్న నగలు, డబ్బు కనిపించకపోయే సరికి దొంగ తన జరిగినట్టు గమనించిన మహిళ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విచిత్ర చోరీ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో జరిగింది.. ఇంటి ముందు గూటిలో భద్రపరచిన తాళం చెవి తీసుకొని దొంగలు దర్జాగా ఇంట్లో ఉన్న సొమ్మంతా కూల్చుకుపోయారు..6 తులాల బంగారు ఆభరణాలు, 17 తులాల వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీ చేశారు. అనసూయ అనే మహిళ తన ఇంటికి తాళం వేసి ఇంటి ముందు ఆవరణలోని గూటిలో తాళం చెవిపెట్టి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం వచ్చి గూటిలో ఉన్న తాళం చెవి తీసుకొని ఇంటికి వేసిన తాళం తెరిచి ఇంట్లోకి వెళ్ళింది.
ఇంట్లోని లోపలి గది తలుపులు తెరిచి ఉండడం చూసి.. గబగబ గదిలోకి వెళ్లింది. గదిలో ఉన్న బీరువా తెరిచి ఉండంతో దాచి పెట్టిన బంగారం, నగదు కనిపించకపోవడంతో ఇంట్లో దొంగలు పడి చోరీ జరిగిందని గ్రహించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇంటి తాళాలు గూటిలో పెడుతారని
Also read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





