ఆసుపత్రి ముందు ఉన్న అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లాడు.. సీన్ కట్ చేస్తే.. అంబులెన్స్ యాక్సిడెంట్ అయ్యి అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఓ దొంగ.. ఈ షాకింగ్ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆరోగ్యం బాగాలేదని వచ్చాడు ఓ యువకుడు.. అంతలోనే బుద్ధి మారింది.. ఆరోగ్యం సంగతి ఏమో కానీ.. ఆసుపత్రి ముందు ఉన్న అంబులెన్స్ అతని కళ్ళలో బడింది.. ఆరోగ్యం తర్వాత అయినా చూపించుకోవచ్చు ముందుగా అంబులెన్స్ సంగతి చూద్దాం అనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా మెల్లిగా అంబులెన్స్ దగ్గరికి వెళ్లి లుక్కేశాడు.. ఆ తర్వాత ఎవ్వరూ చూడటం లేదని గమనించి.. అంబులెన్స్ తో అక్కడి నుంచి ఉడాయించాడు.. ఇక్కడి వరకు బాగానే ఉంది..
సీన్ కట్ చేస్తే.. అంబులెన్స్ ఎత్తుకెళ్తున్న క్రమంలో హైదరాబాద్ రాజీవ్ రహదారిపై దుద్దెడ టోల్ గేట్ దగ్గరకు రాగానే అతడు దొంగిలించిన అంబులెన్స్ కు యాక్సిడెంట్ అయింది. దీనితో ఎక్కడ నుంచి బయలుదేరాడో మళ్లీ అక్కడికి పేషెంట్ లాగా వచ్చి జాయిన్ అయ్యాడు ఆ దొంగ..
ఆ యువకుడి పేరు వల్లెపు అశోక్ అని.. పోలీసులు తెలిపారు. అంబులెన్స్ తీసుకొని తన అక్క దగ్గరికి పోతున్నానని.. ఇంతలో యాక్సిడెంట్ అయినట్లు తమకు సమాధానం చెప్పాడని పోలీసులు తెలిపారు. అశోక్ ది మద్దూర్ మండల రేపర్తి గ్రామంగా పోలీసులు గుర్తించారు. అతని తండ్రి పేరు పోశెట్టిగా పేర్కొన్నారు.
ఏది ఏమైనా అంబులెన్స్ ను ఏ ఆసుపత్రి నుంచి దొంగలించాడో మళ్ళీ అదే ఆసుపత్రికి పేషెంట్ గా రావడంతో ఆసుపత్రి సిబ్బంది, పోలీసులే కాదు.. ఆ దొంగ కూడా ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఈఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది
Also read
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి