November 22, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: సంచలనం సృష్టించిన పాతబస్తీ హత్య కేసులో.. కోర్టు కీలక తీర్పు..!



హైదరాబాద్ పాతబస్తీలో సంచలన సృష్టించిన హత్య కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. పోలీసులు నిందితులకు శిక్షపడే విధంగా పక్కాగా సాక్ష్యాధారాలు ప్రవేశ పెట్టడంతో.. న్యాయస్థానం మృతుని కుటుంబసభ్యులకు న్యాయం చేకూరింది. దీంతో బాధితుడి కుటుంబసభ్యులు, స్నేహితులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. బహదూర్ పురా పోలీసులతో పాటు తీర్పు ఇచ్చిన న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలుపుతూ జేజేలు కొట్టారు.

2017 లో కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మన్సూర్ ఖాన్ అనే వ్యక్తిని బహదూర్ పురా, జూ పార్కు రోడ్డు సమీపంలోని సర్వీస్ స్టేషన్ వద్ద దారుణంగా హతమార్చారు దుండగులు. దీంతో బహదూర్ పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని క్షుణ్నంగా దర్యాప్తు జరిపారు. ప్రతి సాక్ష్యాధారాలను ప్రవేశ పెట్టి కోర్టుకు సమర్పించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు, హైదరాబాద్ నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి ముగ్గురికి జీవిత ఖైదు విధించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన ఖాలేద్, అన్వర్ అలియాస్ అన్నూ, మహమ్మద్ మునవ్వర్ అలీ అలియాస్ బబ్బూకు జీవిత ఖైదుతోపాటు ఒక్కొక్కరికి రూ. 25,500 జరిమాన, జరిమాన కట్టని పక్షంలో మరో 6 నెలల శిక్షను పొడిగిస్తూ అదేశాలు జారీ చేశారు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి.

తీర్పు వెలువడిన అనంతరం బాధిత కుటుండసభ్యులు పోలీస్ శాఖకు, న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు వ్యవస్థల పై తమకు పూర్తిగా నమ్మకం ఉందని ఆనందము వ్యక్తం చేశారు. నేరం చేసిన నిందితులకు ఎప్పటికైనా శిక్ష పడుతుంది. చట్టం నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదని మరోసారి నిరూపితమైంది.

Also read



Related posts

Share via