SGSTV NEWS
Crime

ఇదేం పంచాయితీ నాయన.! అటు ఏపీ.. ఇటు తెలంగాణ.. పోలీసులకే పిచ్చిలేపేసిన్రు..!



ఓ దొంగ కోళ్ల పంచాయితీ.. పోలీసులు వర్సెస్ పోలీసులుగా మారింది.. ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల చోరీ కేసులో తెలంగాణలో పోలీసులు హల్ చల్ చేశారు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో రంగనాథ్ అనే వ్యక్తికి చెందిన 4 పందెం కోళ్లు 10 రోజులు క్రితం చోరీకి గురయ్యాయి. నాలుగు లక్షల రూపాయల విలువైన కోళ్లు పోయాయంటూ.. చింతలపూడి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు రంగనాథ్.


ఓ దొంగ కోళ్ల పంచాయితీ.. పోలీసులు వర్సెస్ పోలీసులుగా మారింది.. ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల చోరీ కేసులో తెలంగాణలో పోలీసులు హల్ చల్ చేశారు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో రంగనాథ్ అనే వ్యక్తికి చెందిన 4 పందెం కోళ్లు 10 రోజులు క్రితం చోరీకి గురయ్యాయి. నాలుగు లక్షల రూపాయల విలువైన కోళ్లు పోయాయంటూ.. చింతలపూడి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు రంగనాథ్. 10 రోజుల తర్వాత బాధితుడే తెలంగాణలోని భద్రాద్రి జిల్లా దమ్మపేటలో చోరీకి గురైన తన పందెం కోళ్లు ఉన్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

దీంతో చింతలపూడికి చెందిన పోలీసులు కోళ్ల కోసం దమ్మపేట వచ్చారు. నాలుగు కార్లలో నేరుగా శేషగిరి అనే వ్యక్తి ఇంట్లోకి ఏపీ పోలీసులు ప్రవేశించి అతని భార్యను బెదిరించి దొంగ కోళ్ల ఎక్కడ ఉన్నాయని నిలదీశారు. అంతేకాదు ఇంటి గేట్లు మూసివేసి, సీసీ కెమెరాలు పగులగొట్టారు. హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. భర్త లేడని చెప్పినా వినకుండా ఏపీ పోలీసులు హల్ చల్ చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న రెండు కోళ్లను తీసుకుని తమ కార్లలో వేసుకున్నారు.

దీంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని దమ్మపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. ఏపీ పోలీసులను స్టేషన్ కు తరలించారు. ఎలాంటి సమాచారం లేకుండా ఇంట్లోకి వచ్చి దుర్భాషలాడుతూ.. ఇంట్లో వస్తువులు చిందర వందర చేశారని, బాధిత మహిళ దమ్మపేట పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనలో చింతలపూడి పీఎస్ కు చెందిన పోలీస్ ఉన్నత అధికారులు.. దమ్మపేట కు వచ్చి తమ పోలీసులను విడిపించుకుని వెళ్ళారు. దొంగ కోళ్ల పంచాయితీ చివరికి పోలీసులు వర్సెస్ పోలీసులు గా మారింది.

Also read

Related posts

Share this