April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: వనస్థలిపురం ప్రభుత్వ దవాఖానాలో నిలువెత్తు నిర్లక్ష్యం.. అప్పుడే పుట్టిన పసికందు మృత్యువాత!

హైదరాబాద్‌, మే 16: ప్రాణాలు పోయవల్సిన డాక్టర్‌ నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో ఓ పసి ప్రాణం గాల్లో కలిసిపోయింది. పురుటి నొప్పులు రావడంతో ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది ఆ మహిళ. తీరా డెలివరీ అయిన తర్వాత తొలుత బొడ్డు పేగును కత్తిరంచడంతో కళ్లు కూడా తెరవక ముందే పసివాడు కన్నుమూశాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని వనస్థలిపురంలోని ఏరియా ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన కథనం మేరకు.

హయత్‌నగర్‌కి చెందిన శిరీష అనే మహిళకు పురుటి నొప్పులు రావడంతో వనస్థలిపురంలోని ఏరియా ప్రభుత్వ దవాఖానకు కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఈ రోజు తెల్లవారు జామున 3 గంటలకి డెలివరీ అయింది. అయితే అదే సమయంలో వైద్యుడు బొడ్డు పేగు మొదటగా కత్తిరించడంతో పసిబిడ్డ మృతి చెందాడు. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది.

దీంతో బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులని ఆశ్రయించారు. సదరు ఆస్పత్రి వైద్యులపై ఫిర్యాదు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అప్పుడే పుట్టిన తమ బిడ్డ మృతి చెందాడని వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా వనస్థలిపురం ప్రభుత్వ దవాఖానలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం తొలిసారి కాదు. ఇప్పటికే పలు మార్లు పదే పదే జరుగుతున్నా హాస్పిటల్‌ వైద్యుల తీరు మారడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read

Related posts

Share via