తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న మహాలక్ష్మీ పథకం వల్ల బస్సుల్లో ప్రయాణించే మహిళల ప్రయాణీకుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు సిగ పట్లు పడుతున్నారు. గొడవలు కొట్లాటలు సర్వసాధారణంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం కొట్టుకున్న మహిళలు, పురుషులు కొట్టుకున్నారు.
ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం కొట్టుకున్న మహిళలు, పురుషులు.. ఈ ఘటన వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి నుంచి వయా నస్కాల్ మీదుగా వికారాబాద్ వెళ్లే ఆర్టీసి బస్సులో సీట్ల కోసం పురుషులు, మహిళలు కొట్టుకున్నారు… పరిగి నుంచి వికారాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఎక్కువ ఉండడంతో దొరికిన ఒక్క సీటు కోసం ఒకరినొకరు కొట్టుకున్నారు. పరిగి నుంచి వికారాబాద్ వెళ్ళేందుకు బస్సులు తక్కువగా ఉన్నందున జనాలు గుంపులు గుంపులుగా బస్సులలో ఎక్కడంతో… సీట్లులేక ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో ఓ చోట జరుగుతూనే ఉన్నాయని తోటి ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ రూట్లో ఇరు ఆర్టీసీ డిపోల అధికారులు స్పందించి బస్సుల సంఖ్య పెంచి… ఇలాంటి ఘటనలు పునవృతం కాకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





