July 3, 2024
SGSTV NEWS
Telangana

హైదరాబాద్ : జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం..గుండెపోటుతో అనంతలోకాలకు!



తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. ఆయనకు సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఈ మేరకు ఆయన సోదరులు, ఆలయ నిర్వాహకులు ఎస్‌టిచారి, శేషాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. రాజగోపాలాచార్యులుకు భార్య, కుమారుడు, కూతురు..

జియాగూడ, ఏప్రిల్ 24: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. ఆయనకు సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఈ మేరకు ఆయన సోదరులు, ఆలయ నిర్వాహకులు ఎస్‌టిచారి, శేషాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. రాజగోపాలాచార్యులుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

కాగా జియాగూడలోని రంగనాథస్వామి దేవస్థానానికి 400 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. మూసీనది ఒడ్డున దీనిని నంగూర్‌ ప్రతమ పీఠం నాలుగు వందల యేళ్ల క్రితం నిర్మించింది. ఇక్కడ జరిగే వైకుంఠ ఏకాదశి పండుగకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు తరలివస్తుంటారు.

ఇంతటి ప్రతిష్ట కలిగిన రంగనాథస్వామి దేవస్థానానికి శృంగారం రాజగోపాలాచార్యులు గత కొంతకాలంగా ప్రథాన అర్చకులుగా సేవలు అందిస్తున్నారు. ఆయనకు శతాధిక దేవాలయాల ప్రతిష్ఠాపక యజ్ఞాచార్యులుగా, దేవతామూర్తుల అలంకార భట్టర్‌గా పేరు. ఇక మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ హిందూ దేవాలయాల పురోభివృద్ధికి ఎంతో పాటుపడిన యజ్ఞాచార్యులుగా ఆయన ఖ్యాతి పొందారు. రాజగోపాలాచార్యులు అంతిమ సంస్కారాలు బుధవారం పురానాపూల్‌ దహనవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన సోదరులు తెలిపారు. రాజగోపాలాచార్యులు హఠాన్మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also also

Related posts

Share via