అకారణంగా ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశారని వందల మంది విద్యార్థులు ప్రిన్సిపాల్ కు మద్దతుగా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ ను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు ఆందోళన విరమించమంటూ విద్యార్థులు తెగేసి చెప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా పరిస్థితి సద్దుమణిగకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ స్పందించి న్యాయం చేస్తానంటూ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి పై తోటి విద్యార్థుల దాడి ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. గత వారం రోజుల క్రితం మనోజ్ గౌడ్ అనే పదవ తరగతి విద్యార్థిపై అదే తరగతి చదువుతున్న మరో ఏడుగురు విద్యార్థులు విచక్షణా రహితంగా దాడి చేసి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసి మరీ పైశాచికానందం పొందడం హాట్ టాపిక్ గా మారింది. బాదిత విద్యార్థి ఎట్టకేలకు తల్లిదండ్రులకు గోడు వెళ్లబోసుకోవడంతో వారం తర్వాత ఘటన వెలుగు చూసింది. విద్యార్థి సంఘాల నేతలతో సోమవారం ఉదయం హాస్టల్ ఎదుట బాదిత విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడంతో ఇష్యూ సీరియస్ గా మారింది. ఎట్టకేలకు విషయం తెలుసుకున్న విద్యాశాఖ ఉన్నతాదికారులు చర్యలు చేపట్టడంతో సీన్ రివర్స్ అయింది.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని మహాత్మా గాంధీ జ్యోతి బాపులే పాఠశాలలో విద్యార్థుల దాడి ఘటన నేపథ్యంలో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. పాఠశాల ప్రిన్సిపాల్ కేవీఎం ప్రకాశ్ ను బాధ్యుడిని చేస్తూ సాయంత్రం సస్పెండ్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ. వెంటనే విధుల నుండి తప్పుకోవాలని తెలుగు లెక్చరర్ రాజ్ కుమార్ ను ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ గా కొనసాగాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్సిపాల్ సస్పెండ్ విషయం తెలుసుకున్న హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగడం తో ఘటన మరో మలుపు తిరిగింది.
అకారణంగా ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశారని వందల మంది విద్యార్థులు ప్రిన్సిపాల్ కు మద్దతుగా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ ను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు ఆందోళన విరమించమంటూ విద్యార్థులు తెగేసి చెప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా పరిస్థితి సద్దుమణిగకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ స్పందించి న్యాయం చేస్తానంటూ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
విద్యార్థులు ఆందోళన చేపట్టడానికి గల కారణాలను తెలుసుకొని ఆందోళనలకు ప్రేరేపించిన వారిపైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే వివేక్. విద్యార్థి పై దాడికి కారణమైన విద్యార్థులపై సైతం చర్యలు తీసుకోవాలని అదికారులను కోరారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025