SGSTV NEWS
CrimeTelangana

Sangareddy: ఛీ.. వీడసలు మనిషేనా? ఆస్తి కోసం కన్నతల్లిని పొడిచి చంపిన కొడుకు!



సంగారెడ్డి జిల్లాలో ఓ కన్నకొడుకు ఆస్తి కోసం తన తల్లిని కత్తితో దాడి చేసి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. మద్యానికి బానిసైన కార్తీక్ రెడ్డి తల్లి రాధికతో ఆస్తి విషయంలో గొడవ పడి, ఆమెపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాధిక మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.


మనవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తుల కోసం అన్నదమ్ముల మధ్య గొడవలంటే సరే అనుకోవచ్చు, కానీ, నవమాసాలు మోసి, కనీ పెంచి ఇంత వాళ్ల వాళ్లను చేసిన తర్వాత కూడా ఆస్తి కోసం ఓ కొడుకు కన్నతల్లిని కడతేర్చాడు. ఈ ఘటన ఎక్కడో కాలు సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కేవలం ఆస్తి కోసం తల్లితో గొడవపడిని ఓ 26 ఏళ్ల కొడుకు తల్లి అనే కనికరం లేకుండా కత్తితో విక్షణారహితంగా దాడి చేసి, ఆమె నిండు ప్రాణాలను బలగొన్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కన్న కొడుకే ఆస్తి కోసం తల్లి పాలిట యముడైన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డివినోస్ విల్లాస్ లో రాధిక కుంటుంబం నివాసం ఉంటోంది.


ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి (26) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఆస్తి కోసం తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. సోమవారం తెల్లవారు జామున తల్లి రాధికతో ఆస్తి కోసం గొడవ పడిన కార్తీక్‌ విక్షణ కోల్పోయి కత్తితో దాడి చేశాడు. కొడుకు నుంచి ఊహించని ఈ పరిణామంతో ఆ తల్లి షాక్‌కు గురైంది. కార్తీక్‌ దాడిలో తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులతో ఉన్న రాధికను కుటుంబ సభ్యులు హుటాహుటిన నల్లగండ్ల లోని సిటిజన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాధిక మృతి చెందింది. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడి కార్తీక్‌ను అదుపులోకి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రాధిక మృతదేహాన్ని పటాన్‌చెరు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.



Also read

Related posts

Share this