పోలీసులకు వీరి వ్యవహారంపై అనుమానం వచ్చింది. దీంతో అన్ని కోణాల్లో విచారణ చేయగా.. తామే దొంగతనం చేసినట్లు కొడుకు, కోడలు ఒప్పుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 70 తులాల బంగారం నగలు, రూ. లక్ష యాభై వేలు నగదు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఈ దొంగతనం విచిత్రంగా ఉంది. స్వంత ఇంట్లోనే దోపిడీ చేశాడు. అమ్మా నాన్నల వద్ద ఉన్న నగదు, బంగారంపై కన్నేశాడు. మరికొంత మందితో దొంగతనానికి ప్లాన్ చేశాడు. అడ్డు వచ్చిన పేరెంట్స్‌పై దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. చివరికి కొడుకు, కోడలే ఈ దొంగతనంలో సూత్రదారులని తేలడంతో అంతా షాక్ అయ్యారు.
అప్పుల పాలు కావడంతో వాటిని తీర్చే అవకాశం లేక పోవడంతో ఏకంగా తల్లిదండ్రుల ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ప్రతాప రాఘవరెడ్డి, వినోద ఇంట్లో జరిగిన దొంగతనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో కొడుకు కోడలు సూత్రధారులుగా పోలీసులు తేల్చారు. దీంతో కొడుకు నాగరాజు, కోడలు షాలిని తోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తో్ంది.
నాగరాజు రూ. ఒక కోటి 80 లక్షల మేర అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చే దారి లేక తన తల్లిదండ్రులను అడగాడు. అందుకు వారు నిరాకరించడంతో.. ఎలాగైనా వారి నుంచి నగదు, బంగారం లాక్కోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో దొంగతనానికి నాగరాజు హోటల్‌లో పనిచేసే అమీర్, కృష్ణ లతో ప్లాన్ చేశాడు. గతంలో 3 సార్లు ప్లాన్ చేయగా అవి బెడిసి కొట్టాయి. అమీర్ అనే వ్యక్తి సమీర్, మున్నా, కృష్ణలతో కలిసి పక్కాగా ప్లాన్ చేశారు. దొంగతనం జరిగిన రోజు నాగరాజు ఇంట్లోనే నిందితులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. నాగరాజు బోర్ వేసి వాటర్ ట్యాంక్ ఓవర్ ఫ్లో చేయడంతో తల్లి వినోద బయటకు వచ్చింది. దీంతో ఆమెపై నిందితులు దాడి చేసి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆపై రాఘవరెడ్డి పై కత్తులతో దాడి చేసి సుమారు 70 తులాల బంగారం నగలు, రూ. 5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. కాగా తెల్లవారుజామున నాగరాజు, షాలిని ఏమి తెలియదన్నట్లుగా సానుభూతి వ్యక్తం చేశారు. ఎక్కడ అనుమానం రాకుండా ఈ ఇద్దరు నటించారు. ఇరుపొరుగు వారిని దొంగతనం జరిగినట్లు నమ్మించారు.
కానీ. పోలీసులకు వీరి వ్యవహారంపై అనుమానం వచ్చింది. దీంతో అన్ని కోణాల్లో విచారణ చేయగా.. తామే దొంగతనం చేసినట్లు కొడుకు, కోడలు ఒప్పుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 70 తులాల బంగారం నగలు, రూ. లక్ష యాభై వేలు నగదు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
Also read
- శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
- Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
- నేటి జాతకములు…14 మార్చి, 2025
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి