SGSTV NEWS
CrimeTelangana

అయ్యో దేవుడా.. ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు తీసుకుంటే చచ్చేదాకా వదిలిపెట్టలేదు.. ఇదో కన్నీటి గాథ

 

ఎల్లుపల్లి గ్రామానికి చెందిన ఐరేని మల్లేశం (30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. 2023లో నూతనంగా నిర్మించుకున్న ఇంటి అవసర నిమిత్తం సిద్దిపేటకు చెందిన చోళ మండలం ఫైనాన్స్ కంపెనీలో ఏడు లక్షల 12 వేల రూపాయల లోన్ అప్పుగా తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి గత కొంతకాలంగా ఈఎంఐ చెల్లిస్తూ వస్తున్నాడు.


ఫైనాన్స్ వేధింపులు ఒక యువకుడి నిండు ప్రాణాలను బలిగొన్నాయి.. ఈ దారుణ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లుపల్లి గ్రామానికి చెందిన ఐరేని మల్లేశం (30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. 2023లో నూతనంగా నిర్మించుకున్న ఇంటి అవసర నిమిత్తం సిద్దిపేటకు చెందిన చోళ మండలం ఫైనాన్స్ కంపెనీలో ఏడు లక్షల 12 వేల రూపాయల లోన్ అప్పుగా తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి గత కొంతకాలంగా ఈఎంఐ చెల్లిస్తూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో రెండు ఈఎంఐలు పెండింగ్ అవడంతో.. గత 5రోజుల నుంచి ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది.. ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఇంటికి రావడం మొదలైంది.. ఎక్కడైనా పనికి వెళ్తే అక్కడికి వెళ్లి వేధించడం ప్రారంభించినట్లు మృతుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఇబ్బంది ఉందని.. డబ్బులు రాగానే చెల్లిస్తామని చెప్పినప్పటికీ వినకుండా ఈ నెల 16వ తేదీన సాయంత్రం ఫైనాన్స్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎల్లుపల్లి గ్రామానికి వచ్చి ఇంటి వద్దకు వచ్చి వేధించారు. డబ్బులు ఇస్తేనే వెళ్తాం లేదంటే తాళవ వేస్తామని.. నువ్వు చచ్చినా ఇక్కడి నుంచి కదిలేది లేదని చెప్పడంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లో నుండి వెళ్లిపోయి తమ వ్యవసాయ బావి శివారులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి తెలిపారు.

గతంలో మిస్టర్ టి అనే పేరుతో టీ స్టాల్ పెట్టి కొంత ఆర్థికంగా ఇబ్బంది అవడంతో ఫైనాన్స్ కట్టడం ఆలస్యమైందని.. ఎంత చెప్తున్నా వినకుండా ఫైనాన్స్ సిబ్బంది అనేక రకాలుగా మానసికంగా హింస పెట్టారని.. దీంతో మనస్తాపంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి దుర్గయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫైనాన్స్ కంపెనీపై కూడా సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు

Also read

Related posts