SGSTV NEWS
CrimeTelangana

Telangana: లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారుల ఎంట్రీ.. దెబ్బకు ఎస్ఐ పరుగో పరుగు..!

ఏసీబీ అధికారులకు చివరి క్షణంలో చిక్కకుండా తప్పించుకున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇసుక ట్రాక్టర్ల యజమానులను వేధిస్తున్న ఓ పోలీస్ అధికారిని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు వల పన్నారు. అయితే ఇలా చిక్కినట్లే చిక్కి సదరు ఎస్ఐ జారుకున్నాడు. బాధితుల నుండి డబ్బులు తీసుకునే క్రమంలో ఏసీబీ అధికారులు పట్టుకోవాలని వ్యూహం రచించారు. అయితే వారిని గమనించిన ఎస్ఐ తప్పించుకుని పరుగులు పెట్టాడు.

Also read :కోడలిపై అఘాయిత్యం.. బాధను దిగమింగిన వివాహిత.. ఆపై కోర్టు సంచలన తీర్పు..

కరీంనగర్ జిల్లాలోని రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధలో ఇసుక ట్రాక్టర్ల రవాణా విషయంలో చోటు చేసుకున్న లావాదేవీల్లో అక్కడి ఎస్ఐకి రూ. 25 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అయితే డబ్బులు ఇవ్వడంలో జాప్యం జరిగింది. దీంతో తరుచూ వేధిస్తున్న సదరు ఎస్ఐపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మధ్యవర్తి ద్వారా ఈ డబ్బులు ఇచ్చేందుకు నిర్ణయం జరగగా, డబ్బులు తీసుకుంటున్న క్రమంలో ఎస్ఐని రెడ్ హ్యండెడ్‌గా పట్టివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో.. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి 12 గంటల ప్రాంతంలో బాధితులు, ఏసీబీ అధికారులు స్టేషన్ కు చేరుకున్నారు.

Also read :Hyderabad: మద్యం తాగాడు, చికెన్‌ బిర్యానీ తిన్నాడు.. అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఏమైందంటే

అయితే ఎస్‌ఐని పోలీస్ స్టేషన్‌కు పిలిపించగా, ఆయన స్టేషన్ కు చేరుకున్న తరువాత ఏసీబీ అధికారులను గమనించిన ఎస్ఐ వెంటనే వెనక్కి తిరిగి పరుగులు తీశాడు. దీంతో అతన్ని పట్టుకోలేకపోయిన ఏసీబీ అధికారులు మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఎస్ఐ ఆచూకి కోసం ఏసీబీ అధికారులు గాలింపు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Also read :యువతితో • వీడియో కాల్ మాట్లాడుతూ యువకుడి ఆత్మహత్య

Related posts

Share this