మాదాపుర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంజిత్ కుమార్ రూ. 20వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్లో నివాసం ఉంటున్న లక్ష్మణ్ నాయక్ ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నాడు. తన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని లక్ష్మణ్ నాయక్‌పై సుధ అనే మహిళ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయంలో మాదాపూర్ ఎస్ఐ రంజిత్ కుమార్ తనకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రావాలని పిలిపించారు.
ఈ సందర్భంగా బాధితుడు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ తనకు 41సి నోటీసులు ఇచ్చి కేసు విషయంలో తమకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఎస్ఐ రంజిత్ కుమార్ డిమాండ్ చేశాడన్నారు. లక్ష రూపాయలు కాకుండా రూ.20 వేలు మాత్రమే ఇవ్వగలనని ఎసిబి అధికారులకు అశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు. అనంతరం ఎసిబి డిఎస్పీ అనంద్ కుమార్ మాట్లాడుతూ.. మాదాపుర్ పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదు అయ్యిందని.. డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ రంజిత్ కుమార్ డిమాండ్ చేస్తున్నాడన్న ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.దీంతో లక్ష్మణ్ నాయక్ రంజిత్ కుమార్‌కు రూ. 20 వేలు డబ్బులు ఇస్తున్న సమయంలో రేడ్ హ్యాండ్‌గా పట్టుకున్నామన్నారు ఏసీబీ డీఎస్పీ.డబ్బులు తిసుకోనే విషయంలో ఎస్ఐ రంజిత్ కుమార్‌తో పాటు రైటర్ విక్రమ్ కు కూడా సంబంధం ఉందన్నారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..