నందిగామలో 40 ఏళ్ల వ్యక్తి 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికతో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. స్కూల్ టీచర్ సమాచారంతో పోలీసులు వ్యక్తిని, అతని భార్యను, పూజారిని అరెస్ట్ చేశారు. ఈ బాల్యవివాహ ప్రయత్నం తెలంగాణలో తీవ్ర ఆందోళన కలిగించింది.
తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో అర్థం కావడం లేదు కానీ కొంతమంది చేసే పనులు చాలా దారుణంగా ఉంటున్నాయి. ఇంత నాగరికత పెరిగిన తర్వాత కూడా కొంతమంది ఇంకా అనాకరికంగానే ప్రవర్తిస్తున్నారు. తాజాగా 8వ తరగతి చదువుతున్న బాలికతో ఏకంగా 40 ఏళ్ల వ్యక్తి పెళ్లికి సిద్ధం అయ్యాడు. ఈ దారుణం మరెక్కడో కాదు మన తెలంగాణలోనే అది కూడా హైదరాబాదుకు కూతవేటు దూరంలోనే జరిగింది. హైదరాబాద్ నుండి 55 కి.మీ దూరంలో ఉన్న నందిగామలో ఆ వ్యక్తి, అతని భార్య ఈ చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడ్డారు. పెళ్లికి సిద్ధమైన వ్యక్తి, అతని భార్య అలాగే పెళ్లి జరిపించేందుకు వచ్చిన పూజారి, ఇతరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు 8వ తరగతి విద్యార్థిని ఒక దండ పట్టుకుని 40 ఏళ్ల వ్యక్తి ముందు నిలబడి ఉన్నట్లు ఒక ఫొటో ఉంది. వారి పక్కన ఆ వ్యక్తి భార్యగా అనుమానించబడిన ఒక మహిళ, అలాగే పూజారి ఉన్నారు. మన దేశంలో బాల్య వివాహం అనేది పిల్లలపై జరిగే అత్యంత తీవ్రమైన నేరాలలో ఒకటిగా పరిగణిస్తారు. అలాంటిది కేవలం 13 ఏళ్ల అమ్మాయితో 40 ఏళ్ల వ్యక్తి పెళ్లికి సిద్ధం అయ్యాడు. అయితే ఈ విషయం స్కూల్ టీచర్‌కు తెలియడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లను అరెస్ట్ చేశారు. అయితే ఈ పెళ్లికి ఆ విద్యార్థిని ఎలా ఒప్పుకుంది? తల్లిదండ్రుల పాత్ర ఏంటి అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





