ఈజీమనీ వేటలో బెట్టింగ్‌కి బానిసలుగా మారుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్‌లకు తగలేస్తున్నారు. ఉన్నతోద్యోగుల నుంచి రూజువారి కూలీల వరకు, గృహిణుల నుంచి విద్యార్థుల వరకు చాలామంది ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసలు అవుతున్నారు. కన్నవారు, కట్టుకున్నవారు, కడుపున పుట్టినవారిని అనాథలను చేసి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉండటంతో.. ఈ బెట్టింగ్ వ్యవహారం పరాకాష్టకు చేరింది.
బెట్టింగ్ వల్ల నష్టపోయి రోజూ దేశవ్యాప్తంగా ఏదో ప్రాంతంలో ఎవరో ఒరకు తనువు చాలిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు లాస్ అయ్యి.. రైలు కింద పడి సూసైడ్ చేసుకుందామనుకున్నాడు. పట్టాలపై పడుకుని చివరిసారిగా సోదరితో కాల్ మాట్లాడుతుండగా, సెల్‌ఫోన్ వెలుగు రావడాన్ని అక్కడే గస్తీ కాస్తున్న రైల్వే పోలీసులు గమనించారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు అతడిని అడ్డుకున్నారు. సినిమాను పోలిన ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది.
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు వివరాల ప్రకారం… ఎస్‌ఆర్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఐటీ ఉద్యోగి కొన్ని రోజుల క్రితం జాబ్ మానేశాడు. దీంతో త్వరితిగతిన డబ్బులు సంపాదించాలని ఆలోచించి క్రికెట్ బెట్టింగ్‌లు వేయడం స్టార్ట్ చేశాడు. అది అతనికి వ్యసనంగా మారింది. దాదాపు రూ.3 లక్షలు బెట్టింగ్స్ ద్వారా పోగొట్టుకున్నాడు. దీంతో తెలిసిన వారందరి వద్ద అప్పులు చేశాడు. ఇచ్చిన వారు డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో.. నైరాశ్యంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.
గురువారం(మార్చి 27) రాత్రి 10 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీప ప్రాంతానికి వెళ్లి పట్టాలపై పడుకున్నాడు. చివరిగా అక్క గుర్తురావడంతో ఆమెకు ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పాడు. క్రికెట్ బెట్టింగ్‌కు కొందరి వద్ద అప్పు చేశానని ఆమెకు తెలిపాడు. దాంతో ఆమె ఆ డబ్బులు ఇస్తానని నచ్చజెప్పింది. అదే సమయంలో సికింద్రాబాద్ స్టేషన్‌లోని ఒకటో నంబరు చివరలో జీఆర్పీ కానిస్టేబుల్ సైదులు, ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సురేశ్ అక్కడే గస్తీ కాస్తున్నారు. వారికి దూరంగా పట్టాలపై సెల్‌ఫోన్ వెలుగు కనిపించింది. వెంటనే అక్కడకు చేరుకున్న ఇద్దరు దగ్గరకు వెళ్లి చూడగా.. పట్టాలపై వ్యక్తి పడుకుని కనిపించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. యువకుడికి నచ్చబెప్పి కుటుంబసభ్యులకు అప్పగించారు
Also read
- సీతాదేవి తనువు చాలిస్తూ భూమిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
- దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే.. సంచలన విషయాలు..
- శ్రీ రామ నవమి పండగ విషయంలో గందరగోళం.. ఏప్రిల్ 5 లేదా 6 ఎప్పుడంటే
- మహిళల రుతు సమయం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?
- AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!