సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద కాకులు హల్ చల్ చేస్తున్నాయి. బయటకి వెళ్ళే, లోపలికి వచ్చే మగ వాళ్లను మాత్రమే తలపై తంతు చెట్టు కొమ్మపై వాలుతున్నాయి. కట్ట మైసమ్మ గుడి ఆనుకొని ఉన్న వేప చెట్టుపై పదుల సంఖ్యలో కాకులు గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయి. కాకుల గూడు నుంచి ఒక కాకి పిల్ల కింద పడిపోవడంతో.. చెట్టు కింద నుంచి నడుస్తున్న మగ వాళ్లు టార్గెట్‌గా వారిపై దాడి చేస్తున్నాయి..
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 12: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద కాకులు హల్ చల్ చేస్తున్నాయి. బయటకి వెళ్ళే, లోపలికి వచ్చే మగ వాళ్లను మాత్రమే తలపై తంతు చెట్టు కొమ్మపై వాలుతున్నాయి. కట్ట మైసమ్మ గుడి ఆనుకొని ఉన్న వేప చెట్టుపై పదుల సంఖ్యలో కాకులు గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయి. కాకుల గూడు నుంచి ఒక కాకి పిల్ల కింద పడిపోవడంతో.. చెట్టు కింద నుంచి నడుస్తున్న మగ వాళ్లు టార్గెట్‌గా వారిపై దాడి చేస్తున్నాయి. కాకులు దాడి చేస్తున్నాయన్న విషయం కొందరికి మాత్రమే తెలియడంతో ఆటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బస్టాండ్ కావడంతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. తెలియని వాళ్ళు ఆటు వైపు వెళ్లడంతో వారిపై దాడి చేస్తున్నాయి. దీంతో ‘ఇదేందిరా బాబు కాకి గోల’ అని మనసులో అనుకుంటూ వేగంగా చెట్టు కింది నుంచి నడిచి వెళుతున్నారు. తలపై ఒక్కసారిగా దాడి చేయడంతో పాద చారులు ఉలిక్కి పడుతున్నారు. దీంతో తన్నడానికి వస్తున్న కాకులను చేతులతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. కాకి పిల్ల చెట్టుపై నుంచి పడిపోవడంతో ఎవరో హానీ చేస్తున్నారని కాకులు భావిస్తున్నట్ల ఉన్నాయి. ఈ క్రమంలో అటు వైపు వెళ్తున్న మగ వారిని కాకులు దాడి చేస్తున్నాయి.
కాకి తంతే ఏం చేయాలి….!
మన దేశం ఎన్నో సంప్రదాయాలు, మరెన్నో నమ్మకాలు ఆచరణలో ఉన్నాయి. అయితే కొన్ని నమ్మకాలు ప్రజల్లో మూఢ నమ్మకంలా బలంగా నాటుకుపోయాయి. ఆరోగ్యానికి హాని చేసే వాటికి చెక్ పెట్టడానికి మన పెద్దలు సంప్రదాయం పేరుతో ఓ భయాన్ని కలిగించేలా కొన్ని నమ్మకాలను ప్రచారాలు చేశారు. అలాంటి వాటిలో కాకి తన్నితే అపశకునం అనే నమ్మకం ఒకటి. కాకి తలపై తన్నితే మరణ వార్త వింటారని.. ఏడేళ్ల పాటు శని తాండవిస్తుందని నమ్ముతుంటారు. అయితే దీని వెనక కూడా శాస్త్రీయత ఉందట. సైన్స్ ప్రకారం కాకి తలపై తన్నితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. కాకి గోళ్లు చాలా పదునుగా ఉంటాయి. కాబట్టి వేగంగా ఎగురుతూ వచ్చి తలపై తన్నితే గోళ్లు గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది.
Also read
- Margashira Masam: పోలి పాడ్యమితో మార్గశిర మాసం ప్రారంభం.. గీతా జయంతి సహా విశిష్ట పండగలు ఏమిటంటే..
- నేటి జాతకములు 4 డిసెంబర్, 2024
- AP News: మాయ మాటలు చెప్పి బాలికను ట్రాప్ చేసిన మ్యాథ్స్ టీచర్.. కోర్టు సంచలన తీర్పు
- డోలి లో గర్భిణీని ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు..
- భార్యాభర్తల డ్రగ్స్ దందా!