విచారణ చేపట్టిన యాంటీ ర్యాగింగ్ కమిటీ జూనియర్ డాక్టర్, ముగ్గురు వైద్య విద్యార్థులు మద్యం మత్తులో ర్యాగింగ్ చేశారంటూ తేల్చారు.
ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా.. ర్యాగింగ్ భూతానికి మాత్రం చెక్ పడడం లేదు. ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ ర్యాగింగ్ భూతం విద్యార్థులను వెంటాడుతోంది. తాజాగా నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది.
నల్లగొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధంగా 2019లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రతి ఏటా 150 మంది విద్యార్థులు చేరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం కలకలం సృష్టించింది. మెడికల్ కాలేజీలో చదువుతున్న కేరళ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు.. తాము చెప్పిన పనులు చేయాలంటూ వేధించి ర్యాగింగ్ కు పాల్పడ్డారని కాలేజీ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ర్యాగింగ్ ఘటనపై ప్రిన్సిపల్ విచారణకు ఆదేశించారు.
విచారణ చేపట్టిన యాంటీ ర్యాగింగ్ కమిటీ జూనియర్ డాక్టర్, ముగ్గురు వైద్య విద్యార్థులు మద్యం మత్తులో ర్యాగింగ్ చేశారంటూ జిల్లా కలెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు నివేదిక ఇచ్చింది. దీంతో ర్యాగింగ్ కు పాల్పడిన 2020 బ్యాచికి చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులను ఆరు నెలలు, 2023 బ్యాచ్ కు చెందిన విద్యార్థికి నెల, జూనియర్ డాక్టర్ ను మూడు నెలలు సస్పెండ్ చేసినట్లు తెలిసింది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025