SGSTV NEWS
CrimeTelangana

గంజాయి మత్తులో బాటసారులను పరుగులు పెట్టించిన ఆకతాయికి దేహశుద్ధి!


జనగామ జిల్లా కేంద్రంలో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. గంజాయి మత్తులో వీరంగం సృష్టించాడు. కత్తి చేతిలో పట్టుకుని ఊరంతా హల్ చల్ చేశాడు. అతనికి ఎదురుపడ్డ వారిని ఆపి కత్తితో పైశాచికంగా దాడికి పాల్పడ్డాడు. మత్తులో మానసిక రోగిలా ప్రవర్తించిన ఆ ఆకతాయికి స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని అమ్మనబావి కాలనీలో జరిగింది. ఓ యువకుడు మత్తులో పట్టపగలే రెచ్చిపోయాడు. కత్తి చేతిలో పట్టుకుని ఊరంతా పరుగులు పెట్టించాడు. అతని ఎవరు ఎదురొచ్చినా ఆపి కత్తితో దాడికి పాల్పడ్డాడు.

ఆ ఆకతాయి కత్తితో బీభత్సం సృష్టించడంతో కాలనీ ప్రజలంతా హడలెత్తిపోయారు. ఈ క్రమంలో కొందరు స్థానికులు సాహసం చేసి అతన్ని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి ఒళ్ళంతా కుళ్ళ పొడిచారు. అతని చేతిలోని కత్తి లాక్కొని కట్టేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దాడికి పాల్పడ్డ ఆ యువకుడు ఎవరూ..! అనేది గుర్తించలేదు. గంజాయి మత్తులో వీరంగం సృష్టించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పోకిరీలపై కఠినచర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు

Also read

Related posts