తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాలో ఘోరం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి చెందింది. ప్రసవాల విషయంలో ఉత్తమ అవార్డు పొందిన ఆస్పత్రిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఇలాకాలో ఘోరం జరిగింది. వికారాబాద్ జిల్లా(vikarabad) తాండూరు(tandoor) ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ(pregnant-women) మృతి చెందింది. ప్రసవాల విషయంలో ఉత్తమ అవార్డు పొందిన ఆస్పత్రిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ తాలూకా రావులపల్లికి చెందిన అఖిల(23) పురిటినొప్పులతో నిన్న అర్ధరాత్రి ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. అంతా నార్మల్‌గా ఉందని చెప్పి గంట తర్వాత మాట మార్చేశారు డాక్టర్లు. పరిస్థితి చేజారిపోయింది వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమంటూ బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. అంతలోనే కడుపులో బిడ్డతో పాటు తల్లి కూడా మృతి చెందింది. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లను సస్పెండ్ చేయాలని బంధువులు ఆసుసత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
ఇక వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. బ్లడ్ గ్రూప్ మార్చి రక్తం ఎక్కించిన ఘటనలో రోగి పరిస్థితి విషమంగా ఉంది. జ్యోతి అనే రోగికి ఓ పాజిటివ్‌కు బదులు బీ పాజిటివ్ బ్లడ్ ఎక్కించింది ఆసుపత్రి సిబ్బంది. దీంతో రోగి పరిస్థితి విషమిస్తుందని, ఆమె ప్రాణాలకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేశారు వైద్యులు. తమ వద్ద ట్రాన్స్‌ఫ్యూషన్ విభాగం లేదని, జ్యోతిని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని కుటుంబసభ్యులకు తెలిపారు డాక్టర్లు. తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, తన భార్యను కాపాడాలని భర్త రాజు డాక్టర్లను వేడుకున్నాడు. తెల్ల, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లేట్స్ సంఖ్య తగ్గడంతో ఆసుపత్రిలో చేరింది కాజీపేట మండలం అయోధ్యపురానికి చెందిన జ్యోతి.
Also read
- Crime: కొంపముంచిన మద్యం.. రైలుకింద నలిగిపోయిన అందమైన కుటుంబం!
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
- Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!